సీజన్‌తో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరసలో ఉంటాయి.ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, తరచూ మొబైల్ ఫోన్‌ని చెంపలకు ఆనించి మాట్లాడటం, సెబమ్ ఉత్పత్తి అధికంగా ఉండటం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, ఊబకాయం వంటి రకరకాల కారణాల వల్ల చర్మంపై మొటిమలు ఏర్పడి ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
మిమ్మల్ని కూడా మొటిమలు బాధిస్తున్నాయా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే మొటిమలు పూర్తిగా తగ్గమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా అడ్డుకట్ట కూడా వేయొచ్చు.మరి ఇంకెందుకు లేటు ఈ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్, పది టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ జింక్ ఆక్సైడ్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖంపై అప్లై చేసుకోవాలి.పదిహేను నిమిషాల పాలు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు నార్మల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీ మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా ఈ రెమెడీలో వాడిన జింక్ ఆక్సైడ్ మొటిమల చికిత్సకు ప్రభావవంతంగా పని చేస్తుంది.అలాగే చర్మంలో సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
అందవల్ల, తరచూ ఈ రెమెడీని ట్రై చేస్తుంటే.మొటిమలు తగ్గడమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటాయి.