కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' షూటింగ్ పూర్తి

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున.

 Nagarjuna Praveen Sattaru The Ghost Movie Shooting Completed Details, Nagarjuna-TeluguStop.com

శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

ఇటివలే విడుదలైన ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా నాగార్జున యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది.ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్‌ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది చిత్ర యూనిట్.ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం ఇంట్రస్టింగా వుంది.

దీనితో పాటు నాగార్జున, సోనాల్ చౌహాన్ లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్న పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో వారి లుక్ అల్ట్రా-స్టైలిష్‌గా ఆకట్టుకుంది.అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్ కి రెడీ అవుతున్నట్లుగా అర్ధమౌతోంది.

యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సంగీతం అందించడంలో స్పెషలిస్ట్ మార్క్ కె రాబిన్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనది ప్రత్యేక శైలి.‘ది ఘోస్ట్’కి ప్రత్యేకమైన స్కోర్ అవసరం కావడంతో మేకర్స్ మార్క్ కె రాబిన్ ని ఎంచుకున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే తేదీన విడుదలైంది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తారాగణం:

నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు.

సాంకేతిక విభాగం

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు, నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్, బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి., సంగీతం: మార్క్ కె రాబిన్, యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల, పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube