ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లో తన ఫోటోను పెట్టి మార్ఫింగ్ చేశారని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనితా రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు ఎంపీ మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో.
ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు.
ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.
అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను టార్గెట్ చేశారని అనితారెడ్డి చెబుతున్నారు.తన ఫొటో మార్ఫింగ్ చేసిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్య లు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.







