అప్పుడప్పుడు ఏదో ఒక రాజకీయ అంశాన్ని, వివిధ ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ తను ఉనికిని చాటుకుంటున్నారు మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.ఆయన సొంత పార్టీ పెడతారని ప్రచారం ఓవైపు జరుగుతుండగా, బిజెపి, టిడిపి, వైసీపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారని, ఎన్నికల సమయం నాటికి ఆయన మరింత యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతూనే ఉంది.
తాజాగా మరోసారి బహిరంగ లేఖ ద్వారా ముద్రగడ వెలుగులోకి వచ్చారు.ముఖ్యంగా కోనసీమ ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖను రాశారు.
కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ముద్రగడ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలను ఉద్దేశించి లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని, అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా అంటూ తన లేఖలో ప్రస్తావించారు.మనమందరం సోదర భావంతో మెలగాల్సిన సమయంలో కులాలు, మతాల కుంపట్లలో మగ్గిపోతున్నామని, అందుకే ఈ లేఖ రాయాలనిపించి రాశానని ముద్రగడ పేర్కొన్నారు.

అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుకోవడం న్యాయంగా లేదని, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా, ఎవరు కాదనలేని పరిస్థితి అని, న్యాయత అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలని, వారు లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఏదో కారణంతో బాలయోగి గారి పేరు పరిగణలోకి తీసుకోకపోయినా, అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అభ్యంతరం పెట్టడం న్యాయమంటారా ఆలోచించండి అంటూ ముద్రగడ లేఖలో ప్రస్తావించారు.గౌరవ మంత్రి పేరు విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ , కుడుపూడి సూర్యనారాయణ రావు, కల్వకొలను తాతాజీ గారు ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నాను అంటూ ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.నేను ఏ స్వార్ధంతోనూ ఈ లేఖ రాయలేదండి.మీరంతా సంతోషంగా ఉండాలన్నదే తన కోరికండి అంటూ ముద్రగడ ముగింపు పలికారు.