తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్, సినీహీరో అశ్విన్ లు కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వెలుపల ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ వైకుంఠ నాధుడిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు.ఆహాకి డ్యాన్స్ ఐకాన్ అనే డ్యాన్స్ షో చేస్తున్నాని, ఈనెల చివరికి ఈ ప్రోగ్రాం ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఓంకార్ చెప్పారు.
.నా తమ్ముడు అశ్విన్ నూతన సినిమా హిడుంబా టీజర్ రిలీజ్ చేయడం జరిగిందని, త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ప్రకటించారు.
ఇక హాట్ స్టార్ కి వెబ్ సిరిస్ చేస్తున్నాని,అందరూ శ్రీనివాసుడి ఆశీస్సులతో బాగుండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిడుంబా చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.







