వైసీపీలో నేరస్తులు, రేపిస్టులకే అందలం –మాజీ మంత్రి చినరాజప్ప గోరంట్ల మాధవ్ చేసిన చేష్టలు సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నాయి.జగన్ ఎంపీ సీటు ఇచ్చే సమయానికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి.
అయినా ప్రజలు నెగ్గించారు.నెగ్గిన తర్వాత కూడా ఆయన ప్రవర్తన మారలేదు.
అదే బాణితోటి అదే పోలీసు భాషతో కార్యక్రమాలు చేస్తున్నారు.జగన్ ఇలాంటి వారినే ప్రోత్సహిస్తూ ఉన్నారు… అలాంటి వారికి ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు… ఆయన పార్టీ అలాంటిది కాబట్టే అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు.







