ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజా శుక్రవారం యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయాన్నిసందర్శించారు.ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.స్వాతి పూజలు అష్టోత్తర శత ఘటాభిషేకంలో పాల్గొన్నారు.అనంతరం శ్రీ వరలక్ష్మీ పూజలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం జరిపి శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదాద్రిఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయడం ఆయన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు.
స్వామి వారి తిరు నక్షత్రం అందులో శ్రావణ శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు







