ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీని వరుస విషాదాలు వేధిస్తున్నాయి.అనేక మంది ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ నుంచి శాశ్వత విరామం తీసుకుని ఈ లోకాన్ని సైతం విడిపోయారు.
తాజాగా హీరో బాలకృష్ణ తోబుట్టువైన ఉమామహేశ్వరి కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే.ఎవరితోబుట్టువైనా కూడా తమ కళ్ళముందే చనిపోతే ఆ బాధ వర్ణించడం సాధ్యం కాని విషయం.
అలా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చాలామంది తమ తోబుట్టువులను అతి చిన్న వయసులోనే కోల్పోయారు.అలా తోడబుట్టిన చెల్లెల్లను కోల్పోయిన స్టార్ హీరోస్ ఎవరో చూద్దాం.
నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ సోదరి అయిన ఉమామహేశ్వరి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది.తీవ్రమైన డిప్రెషన్ లో ఉండడంతో ఆరోగ్య సమస్యలు కూడా అందుకు తోడై ఇలా బలవన్మరణానికి పాల్పడింది ఉమామహేశ్వరి.
ఇక ఉమామహేశ్వరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు.ఇటీవల తన చిన్న కూతురికి వివాహం కూడా ఘనంగా జరిపించింది.కానీ ఇలా ఎన్టీఆర్ కుమార్తె బలవన్మరణం చేసుకొని ఈ లోకాన్ని వీడటం నిజంగా బాధాకరమైన చెప్పాలి.
హీరో విజయ్

తమిళ స్టార్ హీరో అయిన విజయ్ సైతం తన తోబుట్టువును కోల్పోయాడు.స్కూల్ డేస్ లోనే హీరో విజయ్ చెల్లి అయిన విద్య అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది.ఇప్పటికీ విజయ్ తన చెల్లిని తలుచుకొని అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు.ఒక్కోసారి ప్రెస్ మీట్ లో సైతం హీరో విజయ్ తన చెల్లిని తలుచుకుని ఎమోషనల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
హీరో నాగార్జున

అక్కినేని నాగార్జున సైతం చాలా ఏళ్ల క్రితం తన తోబుట్టువును కోల్పోయాడు.హీరో సుమంత్ అలాగే సుప్రియల తల్లి అయిన సత్యవతి కొన్ని అనారోగ్య కారణాలతో కన్ను మూసింది.తల్లి లేని పిల్లలిద్దరినీ కూడా నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చేరదీసి పెంచి పెద్ద చేశారు.
ప్రస్తతం సుప్రియ, సుమంత్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.







