ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్ లో లేదని తేల్చి చెప్పింది.
గతంలో కేంద్రానికి న్యాయస్థానం తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు అభ్యర్ధనలు మురిగిపోయినట్లు తెలుస్తోంది.దీంతో హైకోర్టు తరలింపుపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రం వెల్లడించింది.
అయితే, ముందు ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని, అనంతరం కేంద్రానికి మరో ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని తెలిపింది.







