బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారందరూ ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెబుతున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి హైపర్ ఆది సుడిగాలి సుదీర్ అలాగే రోజా నాగబాబు వంటి వారందరూ కూడా గుడ్ బై చెప్పారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ గ్లామర్ క్వీన్ గా ఉన్నారని చెప్పాలి.తన అందంతో మాటతీరుతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్న అనసూయ సైతం ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
ఈ విధంగా అనసూయ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఇక ఈ కార్యక్రమానికి పూర్తిగా రేటింగ్ పడిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.అనసూయ వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల షూటింగు తో బిజీగా ఉండటం వల్ల తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అనసూయ స్థానంలో ఎవరు యాంకర్ గా రాబోతున్నారనే కుతూహలం అభిమానులలో ఎక్కువైపోయింది.అయితే ఆమె ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉంటే అనసూయ స్థానాన్ని ఆక్రమించిన ఆ యాంకర్ ఎవరో తెలిసిపోతుంది.

ఇకపోతే తాజాగా కొత్త యాంకర్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమంలో అనసూయ యాంకర్ గా వ్యవహరించడం వల్ల ఈమెకు ఒక్కో ఎపిసోడ్ కి సుమారు నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.అయితే ఈమె స్థానాన్ని ఆక్రమించిన కొత్త యాంకర్ కి మాత్రం కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే పారితోషకం ఇస్తున్నారని ఇలా అనసూయతో పోలిస్తే కొత్త యాంకర్ కు రెమ్యూనరేషన్ చాలా తక్కువనే వార్తలు వినపడుతున్నాయి.అయితే తన వాక్చాతుర్యంతో అభిమానులను సందడి చేస్తే తనకు కూడా రెమ్యూనరేషన్ పెంచుతామని మల్లెమాలవారు వెల్లడించినట్లు సమాచారం.
అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా మంజూష వస్తుందని అందరూ భావిస్తున్నారు.మరి ఈ జబర్దస్త్ యాంకర్ ఎవరో తెలియాలంటే కొన్ని గంటలపాటు వేచి ఉండాలి.







