ఆమీర్ ఖాన్ లీడ్ రోల్ లో అద్వైత్ చందన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చడ్డా.ఆగష్టు 11న హిందీతో పాటుగా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా.
తెలుగు వర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా ఉంటున్నారు.లాల్ సింగ్ చడ్డా తెలుగులో మార్కెట్ చేయడానికి ప్రధాన కారణం అందులో మన అక్కినేని హీరో నాగ చైతన్య నటించాడు కాబట్టే.
ఆమీర్ ఖాన్ కి స్నేహితుడిగా నాగ చైతన్య నటించాడు.అందుకే లాల్ సింగ్ చడ్డాని తెలుగులో నాగ చైతన్య సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు.
లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య దాదాపు 30 నిమిషాల దాకా కనిపిస్తారని తెలుస్తుంది.ఇక తెలుగులో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ భారీగా ఖర్చు పెడుతున్నారట.
తెలుగులో భారీ ప్రమోషన్స్ కోసమే దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.తెలుగు సినిమాలు హిందీలో భారీగా మార్కెట్ చేస్తున్న ఈ టైం లో రివర్స్ లో హిందీ సినిమాని తెలుగులో మార్కెట్ చేస్తున్నారు ఆమీర్ ఖాన్.
స్వతహాగా ఆమీర్ ఖాన్ కి తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

లాల్ సింగ్ చడ్డా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుందని అంటున్నారు.అందుకే రిలీజ్ వారం లో మరిన్ని ప్రమోషన్స్ ఏర్పాటు చేస్తున్నారు.ఆమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తెలుగులో హిట్ అయితే మాత్రం ఇక ఆమీర్ తను చేసే ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తారు.అయితే తను చేసే ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఉంటుంది.
ఎలాగు తెలుగు ఆడియెన్స్ కి ప్రయోగాలంటే ఇష్టమే కాబట్టి ఖచ్చితంగా ఆమీర్ సినిమాలు ఇక్కడ్ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.
.






