నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.
అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.
అంతా అనుకున్నట్టే తారక్ రాకతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.దీంతో నందమూరి ప్రేక్షకులు మాత్రమే కాదు.మరికొంత మంది కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆడియెన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.

రిలీజ్ కు ముందు ఎన్ని ప్రొమోషన్స్ చేసిన అవి ఓపెనింగ్స్ కు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి.ఆ తర్వాత కూడా కలెక్షన్స్ కంటిన్యూ అవ్వాలంటే మాత్రం సరైన కంటెంట్ ఉండాలి.అలా ఉన్న సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి.
మరి ఈ సినిమా కూడా కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో చూసిన తర్వాతనే ఆడియెన్స్ ఇది హిట్టో ప్లాపో డిసైడ్ చేస్తారు.
అందుకే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
బింబిసార మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్ ను బట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.ఇక్కడ హిట్ అయితే ఈ సినిమాను డబ్ చేసి ఆగష్టు రెండవ వారంలో రీ రిలీజ్ చేస్తామని మేకర్స్ భావిస్తున్నారు.
మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.







