పుకార్లు నిజం కాదన్న సీతారామం టీమ్‌

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా ఈనెల 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర లో కనిపించబోతుంది.

 Sitaramam Movie Unit Members Clarity About Prabhas At Pre Release Event ,bimbisa-TeluguStop.com

ఈ సినిమా ను టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మించడం వల్ల సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం లో ప్రభాస్ హాజరు కాబోతున్నట్లు గా వార్తలు వచ్చాయి.అయితే ఇటీవల బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క అనుభవం దృష్ట్యా అభిమానులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదంటూ ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యేందుకు గాను నిరాకరించాడని పుకార్లు షికార్లు చేశాయి.

కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ రాబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హాజరు కాబోతున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశామంటూ దర్శక నిర్మాతలు ప్రకటించడం జరిగింది.పోలీసులు మరియు ఇతర శాఖల వారు కూడా ఈవెంట్ కి అనుమతించారని తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చింది లేదు.ఎట్టకేలకు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడుతాడు.ఎలా మాట్లాడుతాడు.అలాగే తన సినిమా ల గురించి ఏమైనా చెబుతాడా అనేది చూడాలి.ప్రభాస్ రాధేశ్యాం సినిమా నిరాశపరిచిన నేపథ్యం లో తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube