సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ఆగష్టు నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉండగా.మహేష్ బాబు 46 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను మాయ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.
అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తాడు.ఇక త్రివిక్రమ్ తో స్టార్ట్ చేయబోయే సినిమా కోసం కూడా మరొక కొత్త స్టైలిష్ లుక్ లో మహేష్ రెడీ అయ్యాడు.
నిన్న మహేష్ బాబు కొత్త ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో మహేష్ కొద్దిగా గడ్డం పెంచి లైట్ బియర్డ్ తో ఆకట్టుకునే లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ఇక ఈ లుక్ త్రివిక్రమ్ సినిమా కోసమే అని తాజాగా బజ్ వినిపిస్తుంది.

మరి త్రివిక్రమ్ సినిమా అంటే హీరో చాలా స్టైలిష్ గా చార్మింగ్ లుక్ లో కనిపించడం సహజమే.ఇప్పుడు మహేష్ బాబు ను కూడా అలానే రెడీ చేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది.మొత్తానికి మహేష్ కోసం స్టైలిష్ లుక్ నే త్రివిక్రమ్ ప్లాన్ చేసాడు.
ఇక ఈ సినిమా ఆగష్టు 15 లేదా 16 తేదీల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.








