ప్రవాస భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్...త్వరలో 10వేల ఉద్యోగాలు..!!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రతీ ఏటా అరబ్బు దేశాలకు వలసలు వెళ్తుంటారు.అలా వలసలు వెళ్ళిన వారిలో ఎంతో మంది ఆర్ధికంగా అక్కడే స్థిరపడగా కొందరు మాత్రం ఇప్పటికి చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్తున్నారు.

 Uae Announced Ten Thousand Jobs,uae,kuwait,training For Emirates Jobs And Skills-TeluguStop.com

అయితే ప్రతిభ, నైపుణ్యం కలిగిన ప్రవాసులు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానాలను చేరుకుంటున్నారు.ముఖ్యంగా భారత్ నుంచీ వలసలు ఎక్కువగా ఉండటంతో అరబ్బు దేశాలలో స్థిరపడి కీలక పదవులలో ఉన్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటారు.అయితే

కువైట్ వంటి దేశాలు తమ దేశస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంగా ఎంతో మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఇప్పటికే ఎంతో మంది ప్రవాసులు సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు కూడా.అయితే ఒక పక్క కువైట్ ప్రవాసుల ఉద్యోగాలు పీకేస్తుంటే మరో పక్క యూఎఈ ప్రభుత్వం మాత్రం ప్రవాసులకు ఉద్యోగాల కల్పనలో ముందుకు వస్తోంది.

ముఖ్యంగా భారత్ నుంచీ తమ దేశానికి వచ్చే వారిని ఎక్కువగా ప్రోశ్చహిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ మేరకు యూఎఈ లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

యూఎఈ లోని భారత కాన్సులేట్ భారత్ లోని సుమారు 10వేల మంది హై స్కిల్డ్ వర్కర్స్ కు యూఎఈ ఉద్యోగావకాశాలు కల్పించనుందని ప్రకటించింది.ట్రైనింగ్ ఫర్ ఎమరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రవాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుందట.

ఈ ట్రైనింగ్ ఎందుకంటే ఎంతో మంది ప్రవాసులు ఉద్యోగాల కోసం ఆశపడి ఏజెంట్ల చేతుల్లో మోస పోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అలాంటి సంఘటనలు ఇకపై జరుగకుండా యూఎఈ లో ఉన్న ఉద్యోగ అవకాశాలను బట్టి ఇక్కడి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అంతేకాదు అక్కడ ఎదురయ్యే సమస్యలు, చేయకూడని పనులు, రూల్స్, శిక్షలు వంటి సమాచారం కూడా ఈ ట్రైనింగ్ లో అందిస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube