భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌...

సినిమా ఎంత గొప్పగా నిర్మించామన్నది కాదు, ప్రమోషన్‌ ఎంత డిఫరెంట్‌గా చేశామన్నదే ఇప్పటి ట్రెండ్‌.ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే ప్రేక్షకులకు నచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి అభిరుచిని భూతద్ధంలోంచి చూస్తున్నాడు మా భాస్కర్‌ నారాయణ.

 First Glimpses Of Shiva Kandukuri Starrer As Bhoothadham Bhaskar Narayana , Bhoo-TeluguStop.com

పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రొడక్షన్‌ విలువలు ఎక్కడా తగ్గకుండా, కథని నమ్మి నిర్మించిన చిత్రమే భూతద్ధం భాస్కర్‌ నారాయణ.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ని ఈరోజు విడుదల చేశారు.

ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈరోజు విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌ లో ఓపెన్‌ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు.

అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు.దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా.! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్‌ నారాయణ ఎంట్రీ. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్‌ తీసుకుంటాడు.

పోలీస్‌ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్‌ నారాయణ.ఈ గ్లింప్స్‌ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్‌ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్‌ కథే ఇది.విలేజ్‌లో డిటెక్టివ్‌ ఏంటి అనిపిస్తుంది కదా.! అదే డైరెక్టర్‌ వినూత్నంగా ప్రెజెంట్‌ చేశారు.థ్రిల్‌ కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమే ఈ భూతద్ధం భాస్కర్‌ నారాయణ.ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ శరవేగంగా జరుగుతున్నాయి.మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube