ప్రభాస్ రాధేశ్యాం సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఆయన అభిమానులంతా ఇప్పుడు ఆసక్తిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా పై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.కేజిఎఫ్ వంటి సంచలన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ కచ్చితంగా ప్రభాస్ తో అద్భుతాన్ని ఆవిష్కరించడం ఖాయం అంటూ అభిమానులు మరియు సినీ వర్గాల వారు నమ్ముతున్నారు.
అందుకే ఈ సినిమా భారీ ఎత్తున నిర్మించేందుకు కూడా నిర్మాణ సంస్థ ముందుకు వస్తుంది.వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కే జి ఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించడం జరిగింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ భారీ యాక్షన్ సన్నివేశాలను రీ షూట్ చేసే ఉద్దేశం తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
కే జి ఎఫ్ 2 సినిమా విడుదల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది.అందుకే ఈ సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
గతంలో 12 కోట్ల వరకు ఖర్చు చేసినా యాక్షన్ సన్నివేశాలను మళ్లీ పర్ఫెక్షన్ కోసం అంటూ రీషూట్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు.ప్రభాస్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదు అనలేడు.
అందుకే త్వరలోనే ఆ భారీ యాక్షన్ సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.హైదరాబాద్లోనే మరోసారి ఆ సన్నివేశాలు చిత్రీకరించారు అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ త్వరలోనే ఇండియాకు వస్తాడు.అప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.