కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి చాలా విచిత్రంగా ఉంటాయి.ఎందుకంటే అవి ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయి ఉంటాయి.
ప్రస్తుతం వాటి గురించి వెతికి తీసి చెప్తే తప్ప ఎవరికి తెలిసే అవకాశం ఉండదు.అలాంటి ఒక విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
అసలు విషయం లోకి వెళ్తే మన అందరికీ తెలుసు మొన్నటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు ఉన్నారు.ఇప్పుడంటే ఒక సినిమా హీరో వస్తున్నాడు అంటే అతనికి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో లభిస్తాయి.
సినిమాకు ముందే బోలెడంత ప్రమోషన్ చేసుకుంటున్నారు.కానీ నాటి స్టార్ హీరోల విషయాలు చాలా తక్కువగానే బయట ప్రపంచానికి తెలుసు.
అలా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారిని అసలు ఎవరు సినిమా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారు ? ఈ సినిమాలో మొదత నటించారు ? అనే విషయాలు చాలామందికి తెలిసే అవకాశమే లేదు.ఆ సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాటి మీర్జాపురం జమీందారైనా D V S రాజు గారు గారికి సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో మక్కువ.ఆయన తొలినాళ్లలో సినిమాలను నిర్మించేవారు అలా ఆయన జీవనజ్యోతి అనే ఒక సినిమా చేస్తున్న క్రమంలో ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కృష్ణవేణి తో రాజు గారికి పరిచయం అయ్యింది.
ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.ఒక రోజు రాజు గారి భవంతి లో పూలు కోస్తున్న కృష్ణవేణి కి ప్రేమ రాయబారం పంపించి పెళ్ళికి ఒప్పించుకున్నారు రాజు గారు.
అలా నిర్మాత అయిన రాజు గారు హీరోయిన్ అయిన కృష్ణవేణి పెళ్లి చేసుకున్నారు.ఒక నిర్మాతతో హీరోయిన్ పెళ్లి కావడం అప్పుడే స్టార్ట్ అయింది.ఇదంతా కూడా 1950’స్ లో జరిగింది.

ఇక ఆ తర్వాత కాలంలో మీర్జాపురం జమీందారైనా రాజుగారు నటి కృష్ణవేణి కలిసి చాలామందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.అంతే కాదు ఇద్దరు కలిసి సినిమాలను నిర్మించేవారు.అలా సీనియర్ ఎన్టీఆర్ ని మన దేశం అనే సినిమాతో 1949లో సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఘనత కూడా నటి కృష్ణవేణికే దక్కుతుంది.
అలాగే కీలు గుర్రం సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు ని సైతం సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ కృష్ణవేణి మరియు రాజు గారి దంపతులే సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.ఆ తర్వాత ఘంటసాల లాంటి ఎంతో మంది సంగీత దర్శకులను, సింగర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది.
అంతే కాదండి ఎస్వీ రంగారావును సైతం రాజుగారు మరియు కృష్ణవేణి తొలిసారిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఈ దంపతులు పరిచయం చేసిన నటి నటులంతా కూడా స్టార్స్ గా, సెలబ్రిటీస్ గా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయారు
.






