ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏకంగా నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు చూసుకుపోతుంది.ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా వరుసగా బాలీవుడ్ అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఈమె చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇదివరకే ఈమె వరుణ్ ధావన్ సరసన గుడ్ బై సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విక్కీ కౌశల్ సరసన నటిస్తున్న సినిమా సెట్ లోకి అడుగు పెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారు.ఇలా వీరిద్దరూ పీకల్లోకి ప్రేమలో మునిగితేలిన అనంతరం పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇలా పెళ్లయిన వెంటనే ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉండగా తాజాగా విక్కీ కౌశల్ సినిమాలో నటిస్తున్నటువంటి రష్మిక ఏకంగా విక్కీ కౌశల్ తో ముచ్చట్లు పెట్టుకొని అతనిని ఆట పట్టించింది.ఈ క్రమంలోని రష్మిక స్పందిస్తూ నీతో షూటింగ్ అంటేనే ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అంటూ ఓ ఏమోజిక్ షేర్ చేస్తూ రష్మిక కౌంటర్ వేసింది.

ఇక ఈ పోస్టుపై విక్కీ కౌశల్ స్పందిస్తూ… ఇలా నీతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రష్మిక పోస్ట్ కు విక్కీ కౌశల్ రిప్లై ఇచ్చారు.ఇక ఈ పోస్ట్ పై రష్మిక స్పందిస్తూ నువ్వేమో అద్భుతంగా చేసి నన్ను ఒక వైరస లా మార్చావు.థాంక్యూ సో మచ్ నీ ప్రేమతో నన్ను టచ్ చేసినందుకు అంటూ రష్మిక పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







