ఒక సినిమా విడుదలైన అంటే చాలు ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసే చూపులు అంతా ఇంతా కాదు.ఒక సినిమా మరో రెండు వారాల్లో విడుదల అవుతుంటే ఇప్పటి నుండే ప్రేక్షకులు ఆ సినిమా కోసం తెగ ప్లాన్స్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఒకే వారంలో రెండు మూడు సినిమాలు విడుదలైన అంటే చాలు ఏ సినిమాకు వెళ్లాలో అర్థంకాక తల పట్టుకుంటారు.
అదే ఒక నెలలో గ్యాప్ తో సినిమాలు విడుదల అవుతుంది అంటే.
ఆ నెల మొత్తం సిని ప్రియులకు పండగ అనే చెప్పాలి.ఇప్పుడు అలాంటి పండగే ఈ నెలలో వస్తుంది.
ఈ నెల మొత్తం వరుసగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి.మరి ఈ సినిమాలు ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాయో.ఇంతకు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతరామం:
రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సీతరామం.దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న, మృణాళిని ఠాకూర్, సుమంత నటిస్తున్నారు.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా ఈనెల 5 న విడుదల కానుంది.
బింబిసార:
దర్శకుడు వశిస్ట్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బింబిసార.ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్, రినా హుస్సేన్‌లు నటించారు.ఇక ఈ సినిమా ఈనెల 5న విడుదల కానుంది.
లాల్ సింగ్ చద్దా:
అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సింగ్ చద్దా.అమీర్ ఖాన్, కరీనా కపూర్ , నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తికేయ2:
చందూ దర్శకత్వంలో రూపొందిన సినిమా కార్తికేయ.ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటీనటులుగా నటించారు.ఈ సినిమా ఈ నెల 12 న విడుదల కానుంది.
మాచర్లనియోజకవర్గం:
ఎమ్మెస్ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.ఇందులో నితిన్ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
విరుమాన్:
ఎం.ముత్తయ్య దర్శకత్వం వహించిన సినిమా విరుమాన్.ఇందులో కార్తీ, అదితి శంకర్, ప్రకాష్ రాజ్, రాజకిరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా 12న విడుదల కానుంది.

స్వాతిముత్యం:
లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వాతిముత్యం.ఇందులో వి.కే నరేష్, వర్ష బొల్లమ్మ నటించారు.ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది.
తీస్మార్ ఖాన్:
కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తీస్మార్ ఖాన్.ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాంటెడ్ పండుగాడు:
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాంటెడ్ పండుగాడు.ఇందులో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
మాటరాని మౌనమిది:
దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా మాటరాని మౌనమిది.ఇందులో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.

కమిట్మెంట్:
లక్ష్మీకాంత్ చెన్నారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కమిట్మెంట్.తేజస్వి మదివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
లైగర్:
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లైగర్.విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది.
కళాపురం:
డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కళాపురం.ఇందులో సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు.ఇక ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది.
పిశాచి 2:
దేవరాజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పిశాచి 2.ఈ సినిమాలో రూపేష్ శెట్టి, రాఘవ ఉదయ్ నటించగా ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది.







