వచ్చిందంటే చాలు ప్రతి సినిమా ప్రేక్షకుడు వేయి కళ్ళతో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.ఇక కొంతమంది సినిమా మీకోసయితే శుక్రవారం తమ సినిమా విడుదల చేయడానికి ఎదురుచూస్తే ఇక ప్రేక్షకులైతే వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తూ ఉంటారు.
ఇది ప్రతి శుక్రవారం జరిగే తంతే.ఇక అంతగా ఎదురుచూసిన ఆ సినిమా ఆడిందంటే ఓకే, లేదంటే ఆ ఒక్క శుక్రవారం అందరి జీవితాలను కూడా మార్చేస్తుంది.
మరి ఇంతటి ముఖ్యమైన ఈ శుక్రవారం రోజునే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా ? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వారం అంతా కూడా కష్టపడి వారాంతంలో సినిమాలు చూడడం అనేది అందరి జీవితాల్లో సర్వసాధారణంగా జరుగుతుంది.
మన జీవనశైలి కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే వారం అంతా పడిన కష్టం ఆ ఒక రోజు లేదా రెండు రోజుల్లో తీరిపోవాలని అనుకుంటాం.వారాంతంలో కుటుంబంతో కలిసి అందరూ సరదాగా సంతోషంగా సినిమా చూడడానికి వెళుతూ ఉంటారు నేటితరం యువత.మన భారత దేశంలో అన్ని సినిమాలు కూడా శుక్రవారం రోజునే అంటే వారంతంలోనే విడుదలవుతూ ఉంటాయి.90 శాతం అలాగే విడుదల చేస్తారు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రం అంతకు ముందు రోజు, లేదంటే ఆ తర్వాత రోజు కూడా విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.

కేవలం వారాంతం సెంటిమెంటు మాత్రమే కాకుండా ఇలా శుక్రవారం రోజు సినిమాలు విడుదల చేయడానికి అనేకమైన సెంటిమెంట్స్ ఉన్నాయ్ అనేది ప్రస్తుతం తెలుస్తున్న విషయం.1950 ముందు వరకు కూడా ఏ సినిమా కూడా శుక్రవారం విడుదల అయ్యేది కాదట.కానీ మొట్టమొదటిసారిగా ఆ శుక్రవారం మన భారతదేశంలో విడుదలైన సినిమా మొగల్ ఏ అజమ్.తర్వాత అన్ని సినిమాలు కూడా శుక్రవారం విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు అయితే ఈ సాంప్రదాయం కల్చర్ నుంచి అరువు తెచ్చుకున్నదే కాబట్టి అది ఫాలో అవుతున్నారనే వారు కూడా లేకపోలేదు.
నగరాల్లో శుక్రవారం పూట సెలవులు ఉండటం కూడా ఎందుకు ప్రధాన కారణం.ఇక మన భారతదేశంలో శుక్రవారం అంటే లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు అందుకే ప్రొడ్యూసర్లు కూడా శుక్రవారం విడుదల చేస్తే ఆ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని నమ్మకంతో అదే రోజు విడుదల చేయడానికి ఇష్టపడతారు.
దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా శుక్రవారం సెంటిమెంట్ కి బాగా అలవాటు పడిపోయారు.ఎందుకంటే శుక్రవారం బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత రోజుల్లో ఆ డబ్బులు తమ తమ బాకీలు చెల్లించడానికి లేదా పేమెంట్ లు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేది ఒక భావన.







