సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని మరొక 24 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.
వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.
లైగర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అనేది ట్రైలర్ తోనే తేలిపోయింది.

ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ రికార్డులను బద్దలు కొడుతోంది.తాజాగా టీమ్ అంతా ప్రొమోషన్స్ లో భాగంగా ముంబై లోని ఒక మాల్ లో ప్రేక్షకులతో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.అక్కడ బాలీవుడ్ ప్రేక్షకులు లైగర్ కోసం భారీ సంఖ్యలో విచ్చేసారు.
వీరి ఎగ్జైట్మెంట్ చూస్తేనే అర్ధం అవుతుంది మన లైగర్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో.ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల క్రేజ్ చూస్తూనే బ్లాక్ బస్టర్ అని ముందే తేలిపోయింది.
మరి రిలీజ్ తర్వాత క్రేజ్ ఎలా ఉంటుందో? ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో? చూడాలి.








