గతంతో పోల్చితే జనసేన పార్టీ ఏపీలో బాగా యాక్టిివ్ అయ్యింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనే ధీమా ను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు .
ఇప్పటికే ప్రజా సమస్యలపై జనసేన దృష్టి పెట్టి వాటిపై వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తోంది.ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు యాక్టివ్ గా జనసేన ను జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో జనసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తుంది అనే లెక్కల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా, జనసేన ప్రస్తుత పరిస్థితి చూస్తే కేవలం నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దించే విషయమే ఏమాత్రం ప్రయత్నాలు చేయలేనట్టుగానే వ్యవహరిస్తుంది.జనసేనకు గుర్తింపు రావాలన్నా , కేంద్రంతో ఎటువంటి సంప్రదింపులు చేయాలన్నా, ఎంపీ స్థానాలు ఉంటేనే ఆ స్థాయిలో గౌరవం దక్కుతుంది ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించ లేకపోవడానికి కారణం కేవలం మూడు ఎంపీ స్థానాలను టిడిపి గెలుచుకోవడమే.22 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపీకి కేంద్రం ఏ స్థాయిలో గౌరవం మర్యాదలు ఇస్తుందో అందరికీ తెలిసిందే.అటువంటి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా టిడిపి అయినా జనసేన అయినా ఆ స్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకోవాల్సిందే.
ఇప్పటికే టిడిపి పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసే పనులు నిమగ్నమైంది.ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తే ఇప్పటి నుంచే ఆర్థికంగా ఎంపీ అభ్యర్థులు ఆదుకుంటారని, ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఖర్చు పెడతారని లెక్కలు వేసుకుంటున్నారు.

ఏ పార్టీ అయినా ఎంపీ అభ్యర్థులకు ఆర్థికంగా సహాయం చేయకుండా ఆర్థిక బలం ఉన్న వారిని ఎంపీ అభ్యర్థులుగా పోటీకి దింపి ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలోని అభ్యర్థులకు ఆర్థికంగా అండదండలు అందేలా చూస్తూ ఉంటాయి.కానీ ఈ విషయంలో జనసేన పెద్దగా దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు. జనసేనకు కాకినాడ, అనకాపల్లి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో కాస్త పట్టు ఉంది.అయితే టిడిపితో పొత్తు పెట్టుకుంటే నరసాపురం మినహా మిగిలిన రెండు నియోజకవర్గాల్లో జనసేనకు చాన్స్ ఇచ్చే అవకాశం లేదు.
అంతే కాకుండా ఇప్పటికే చాలా చోట్ల పార్టీ ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తున్నారు.రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గంట నరహరి అనే పారిశ్రామిక వేత్త పేరును చంద్రబాబు ప్రకటించారు.
ఒకవేళ టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకోకపోయినా, సొంతంగా గెలవగలిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు లేకపోవడం, రాబోయే రోజుల్లో జనసేనకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇక పవన్ సైతం పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు తప్ప, పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో అంతగా దృష్టి సారించడం లేదు.







