ఈ ఏడాది మేలో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లను పొట్టనబెట్టుకున్న టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే.ఈ దుర్ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్, విద్యార్ధుల మానసిక స్ధితి, తల్లిదండ్రుల పెంపకం వంటి అంశాలపై విపరీతమైన చర్చ జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి టెక్సాస్ హౌస్ కమిటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే.ఈ కమిటీ నివేదిక విడుదల చేసిన తర్వాత సోమవారం సస్పెన్షన్‌కు గురైన రాబ్ ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపాల్ మాండీ గుటిరెజ్.
తిరిగి విధుల్లో చేరనున్నారు.ఈ మేరకు ఆమె కమిటీకి రాసిన లేఖలో తన ఉద్దేశాన్ని తెలియజేశారు.
టెక్సాస్ హౌస్ కమిటీ ఈ నెల ప్రారంభంలో ఒక నివేదికలో పాఠశాలలోని లోపాలపై ధ్వజమెత్తింది.పాఠశాల నిర్వాహకులు, స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీసులకు ఈ ప్రమాదకరమైన లోపాల గురించి తెలుసునని , కానీ వీటిని వారు పట్టించుకోలేదని కమిటీ మండిపడింది.
అయితే బుధవారం కమిటీకి రాసిన లేఖలో ఈ వాదనలను గుటిరెజ్ ఖండించారు.రాబ్ ఎలిమెంటరీకి సంబంధించిన ఏదైనా భద్రత సమస్యపై తాను సంతృప్తి చెందానని చెప్పడం సరికాదన్నారు.
జీవితాంతం తాను ఈ సంఘటనల భయంతోనే జీవిస్తానని గుటిరెజ్ ఆవేదన వ్యక్తం చేశారు.తాను తన ఉద్యోగాన్ని కొనసాగించాలని అనుకుంటున్నానని… తద్వారా తాను తన కుటుంబానికి, ప్రాణాలతో బయటపడిన పిల్లలకు, బాధిత కుటుంబాలకు, తాను ఇష్టపడే ఉవాల్డే కమ్యూనిటీకి సహాయం చేయగలనని ఆమె వ్యాఖ్యానించారు.
గుటిరెజ్ న్యాయవాది.రికార్డో సెడిల్లో మాట్లాడుతూ.ప్రిన్సిపాల్‌గా ఆమె తిరిగి తన పాత్రను పోషించనుందని అన్నారు.గుటిరెజ్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్ విత్ పే ఎత్తివేయబడిందని.
తన స్థానానికి తిరిగి వచ్చారని సెడిల్లో తెలిపారు.

ఇకపోతే.ఉవాల్డే నరమేధానికి సంబంధించి.ఉవాల్డే స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ పీట్ అర్రెడోండో, యాక్టివ్ ఉవాల్డే పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ మరియానో పర్గాస్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.ఈ సంగతి పక్కనబెడితే.21 మంది ప్రాణాలు తీసిన ఈ మారణకాండపై టెక్సాస్ శాసనసభ్యుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వ్యవస్థాపరమైన వైఫల్యాలు, పేలవమైన నాయకత్వం’’ ఈ మరణాలకు కారణమని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
టెక్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ తన విచారణలో మే 24న రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో 18 ఏళ్ల ముష్కరుడిని ఎదుర్కోవడానికి, మట్టుబెట్టడానికి… పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు గంటకు పైగా సమయం ఎందుకు పట్టిందో తెలుసుకోవడానికి యత్నించింది.
చట్టాన్ని అమలు చేసే అధికారులు.సాయుధుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని, వారి వ్యక్తిగత ఆత్మరక్షణకే ప్రాధాన్యతనిచ్చి, అమాయకుల ప్రాణాలను రక్షించడంలో విఫలమయ్యారని నివేదికలో చట్టసభ సభ్యులు మండిపడ్డారు.77 పేజీల ఈ నివేదికలో 376 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పష్టమైన నాయకత్వం లేకుండా , అస్తవ్యస్తమైన ప్రణాళికతో పాఠశాలకు చేరుకున్నారని ప్రస్తావించారు.కాల్పులు జరిపిన నిందితుడిని మినహాయించి, కమిటీ తన దర్యాప్తులో విలన్లను కనుగొనలేదని దుయ్యబట్టింది.
దీనికి బదులుగా తాము వ్యవస్థాగత వైఫల్యాలు, పేలవమైన నిర్ణయాలను కనుగొన్నామని నివేదికలో పేర్కొన్నారు.గాయపడిన బాధితులకు సహాయం అందించడంలోనూ జాప్యం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువైందని కమిటీ పేర్కొంది.