ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ అనుబంధ సంస్థ శాంసంగ్ ఆస్ట్రేలియాకు భారీ జరిమానా వేసింది అక్కడి ఫెడరల్ కోర్టు. వాటర్ రెసిస్టెంట్ పేరిట తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు గానూ 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో రూ.78 కోట్లు ఫైన్ విధించింది.30 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఫెడర్ కోర్టు జడ్జి జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ హెచ్చరించారు.ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ కి అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే రూ.1.10 కోట్లు చెల్లించాలని ఆదేశించారు న్యాయమూర్తి.
విషయం ఏమిటంటే… తమ స్మార్ట్ ఫోన్స్ నీటిని తట్టుకొని నిలబడగలవు అని 2016-2018 మధ్య శాంసంగ్ కొన్ని బోగస్ ప్రకటనలు చేసింది.S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 ఫోన్ల ప్రచారానికి ఈ తరహా ప్రకటనలను అప్పట్లో చేసింది.ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్స్ లో వాటిని పట్టుకొని ఈదినా, సముద్రంలో మునిగినా ఈ ఫోన్లు తట్టుకుని నిలబడతాయని అసత్యపు ప్రకటనలు చేసింది.నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి.
తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఫోన్లు పూర్తిగా పనిచేయడం మానేసినట్లు వందల సంఖ్యలో ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి పిర్యాదులు అందాయి.
దాంతో దీనిపై ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ విచారణ చేసి తుది ప్రకటన ఇచ్చింది.శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని జడ్జి శాంసంగ్ కు సూచించారు.ఇలాంటి ప్రకటనలు సామాన్యులను తప్పుదోవ పట్టిస్తాయని, దాంతో పెద్ద ఎత్తున ఫోన్లు కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రకటనల సమయంలో శాంసంగ్ పొందిన లాభం కంటే తాము విధించిన పెనాల్టీనే అధికంగా ఉందని తెలుస్తోంది.