దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో నటిస్తూ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర నటుడిగా కొనసాగుతూ ఆ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడంతో తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా తెలుగులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ధనుష్ ఏకంగా ప్రస్తుతం పూర్తిస్థాయి తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరియర్ గురించి అలాగే తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టారు.
ధనుష్ ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఆయన దర్శకత్వంలో వచ్చిన తుల్లువదో ఇళ్లమై అనే సినిమాతో హీరోగా ధనుష్ పరిచయం అయ్యారు.ఈ సినిమా అనంతరం ఆయన అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ కాదల్ కొండెయిన్ అనే సినిమా చేశాడు.ఈ సినిమాతో ఈయన స్టార్ హీరోగా మారిపోయారు.
అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తన అన్నయ్యకు నచ్చిన విధంగా సీన్ రావడం కోసం తనని కొట్టారని, ఇలా అన్నయ్య చేతిలో దెబ్బలు తిన్నానని ధనుష్ తెలిపారు.

ఆరోజు దర్శకుడిగా అన్నయ్య తనని కొట్టడం వల్లే తాను నేడు నటుడిగా ఇంత గొప్ప స్థానంలో ఉన్నానని ధనుష్ వెల్లడించారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి కూడా ధనుష్ తెలిపారు.16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను ప్లస్ వన్ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, ఇలా ప్రేమలో పడటం వల్ల చదువు అట్టకెక్కిందని తెలిపారు.అయితే ఫస్ట్ లవ్ ఎవరికైనా స్వీట్ మెమోరీ అంటూ ఈ సందర్భంగా ధనుష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







