నేను ఆడవారితో కంటే మగవారితోనే స్నేహం ఎక్కువగా చేస్తాను ఈ మాట అన్నది మరెవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ షావుకారు జానకి. ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం హీరోయిన్స్ లో ఎవరికైనా ఉంటుందా? కానీ మన ఈ నిన్నటి తరం హీరోయిన్ షావుకారు జానకి మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు తనకి ఆడ స్నేహితుల కంటే మగ స్నేహితులే ఎక్కువ అని.అందుకు కచ్చితంగా ఒక కారణం ఉందట మగవారితో స్నేహం చేయడం తప్పు కాదు అని బల్ల గుద్దుతుంది జానకి.మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దాం పదండి.

90 ఏళ్ల వయసులో షావుకారు జానకి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఇప్పటికి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.రాజమండ్రిలో పుట్టిన జానకి షావుకారు అనే సినిమాతో తన కెరియర్ ని ప్రారంభించగా అదే పేరును తన ఇంటిపేరుగా కూడా మార్చేసుకుంది.ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన షావుకారు జానకి ఏకంగా తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో 370 కి పైగా సినిమాల్లో నటించింది ఇందులో 200 కు పైగా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం.ఇక షావుకారు జానకి చెల్లెలు కృష్ణ కుమారి కూడా సౌత్ ఇండియాలో నిన్నటి తరం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
అలాగే కళారంగంలో అమే చేసిన సేవకు గాను పద్మశ్రీ అవార్డు సైతం వరించింది.
ఇక స్నేహితుల విషయానికి వచ్చేసరికి తనకు అసలు ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ఉద్దేశమే ఉండదని పూర్తిగా స్నేహితులతోనే సమయం గడుపుతానని చెప్పడం సంచలనంగా మారింది.
కారణం ఏంటంటే ఆడవాళ్ళతో స్నేహం చేస్తే చీరలు, నగలు, ఇల్లు, పిల్లలు తప్ప మరొక విషయం, ప్రపంచ జ్ఞానం తెలిసే అవకాశం లేదు అని కానీ మగవాళ్ళతో స్నేహం చేస్తే సినిమాలు, రాజకీయాలు, ప్రపంచం గురించి మాట్లాడుతుంటే జీవితంలో ఒక అడుగు పైకేస్తామని షావుకారు జానకి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎంత స్నేహితులు ఉన్నా కూడా తాను ఎప్పుడూ తను పరిది దాటి ప్రవర్తించను అంటు కుండ బద్దలు కొడుతోంది షావుకారు జానకి.







