సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్ నడుస్తూ ఉంది అంటూ ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.ఇప్పుడు నుంచి కాదండోయ్ ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఈ గాసిప్స్ హవా నడుస్తుంది అని చెప్పాలి.
అప్పట్లో కూడా మీడియా వాళ్లు ఎంతో మంది హీరో హీరోయిన్లకు లింకు పెట్టేవారు.ఇలాంటిదే జరిగింది హీరో రామశర్మ విషయంలో కూడా జరిగిందట.
ఈ పేరు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఎందుకంటే ఈయన తమిళ నిర్మాతల తెలుగు హీరో.
అదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారు కదా.తమిళ నిర్మాతలు తెలుగులో తీసిన సినిమాల్లో ఎక్కువగా హీరోగా నటించారు రామశర్మ.
ఇంతకీ మీడియా ఆయనను ఏ హీరోయిన్ తో లింకు పెట్టి ఆటాడుకుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.మొదటిసారి రామశర్మ అదృష్టదీపుడు అనే సినిమాలో నటించారు.
ఈ సినిమాలో ద్విపాత్రాభినయం.అయితే ఇదే సినిమాలో నటించింది కృష్ణకుమారి.
ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం.ఇక ఆ తర్వాత ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇదే జోడి ని కంటిన్యూ చేశారు.
బంగారు పాపలు అనే సినిమాల్లో అయితే వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది అని చెప్పాలి.
ఇంకేముంది కృష్ణకుమారి రామశర్మ మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

సినిమా సెలబ్రిటీలకు ఇలాంటి వార్తలు కామన్ కాబట్టి మొదట రామశర్మ కూడా పెద్దగా పట్టించుకోలేదు.చివరికి ఓ రోజు మీడియా ముందుకు వచ్చి మా మధ్య ఏం లేదు బాబు.అలా రాయకండి అంటూ చెప్పేసాడు.ఇంకేముంది మీడియా వాళ్ళు కృష్ణకుమారి తో లింకు పెట్టడం మానేశారు.కానీ ఆ తర్వాత రామ శర్మ కు సావిత్రితో ఎఫైర్ నడుస్తోందంటూ కొత్త వార్తతో ట్విస్ట్ ఇచ్చారు.ఇంకేముంది.
మనం ఎంత చెప్పినా వాళ్ళు రాసేది వాళ్లు రాసుకుంటారు అంటూ సైలెంట్ గా ఉండిపోయారు రామ శర్మ .ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ గాసిప్ కూడా కనుమరుగైంది.అయితే కుటుంబ సమస్యల నేపథ్యంలో రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన రామశర్మ మళ్లీ వచ్చిన అవకాశాలు దక్కలేదు.దీంతో తనకు తెలిసిన హోమియోపతి వైద్యుడు అవతారమెత్తి డాక్టర్ గా బాగానే సంపాదించాడు రామ శర్మ.







