దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాళిని హీరోయిన్ గా రష్మిక మందన్నా కీలక పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందిన సీతారామం సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా ను వైజయంతి మూవీస్ బ్యానర్ లో మెగా నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన విషయం తెల్సిందే.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమా ల్లో అశ్వినీదత్ మీడియా ముందుకు వచ్చాడు.అశ్వినీదత్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రావడం తో ఆయన నిర్మాణం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ కే గురించి మీడియా వారు తెగ ప్రశ్నించారు.
అన్ని ప్రశ్నలకు కూడా ఆయన సింపుల్ గా సమాధానం ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ సినిమా భారీ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఖచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమా లను మించి ఉంటుందనే నమ్మకం ను కూడా వ్యక్తం చేశారు.హాలీవుడ్ సినిమా అవెంజర్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడని.
ఇండియన్ అవెంజర్స్ మూవీ గా ప్రాజెక్ట్ కే ను భవిష్యత్తు లో ఇండియన్స్ గొప్ప గా చెప్పుకోవచ్చు అంటూ ప్రభాస్ అభిమానులకు బూస్ట్ ఇచ్చే విధంగా మాట్లాడాడు.

అమితాబచ్చన్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎప్పుడు కనిపించని విభిన్నమైన గెటప్స్ మరియు పాత్రల్లో కనిపించబోతున్నారు అంటూ అశ్వినీదత్ పేర్కొన్నారు.ఇక విడుదల విషయం లో కూడా ఆయన దాదాపుగా కన్ఫర్మ్ చేశాడు.వచ్చే ఏడాది లో విడుదల ఉంటుందనే నమ్మకం ను ప్రభాస్ అభిమానులకు కలిగించాడు.
వచ్చే ఏడాది ఎప్పుడు అనేది మాత్రం ఆయన చెప్పలేదు.వచ్చే ఏడాది లో ఖచ్చితంగా భారీ ఎత్తున ఈ సినిమా ను విడుదల చేసి పాన్ వరల్డ్ మూవీ గా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు.







