ఈ టాలీవుడ్ హీరో బావిలో కప్పలాంటోడట.. పెళ్లైందా అని అడుగుతారంటూ?

తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోలలో తొట్టెంపూడి వేణు ఒకరు.రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో తొట్టెంపూడి వేణు సీఐ రోల్ లో నటించగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.

 Actor Venu Comments Goes Viral In Social Media Details Here , Venu ,actor Ven-TeluguStop.com

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేణు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వేణు మాట్లాడుతూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండూ వేర్వేరు పార్శ్వాలు అని చెప్పుకొచ్చారు.

రీల్ లైఫ్ ను, రియల్ లైఫ్ ను ఒకదానితో ఒకటి కలపలేమని ఆయన చెప్పుకొచ్చారు.నేను సినిమాలు, సినిమాల ప్రమోషన్స్ కోసం బయటకు వెళుతుంటే ఆ సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి తన భార్య అని వేణు కామెంట్లు చేశారు.

ఆ క్రెడిట్ అంతా నా భార్యకే దక్కుతుందని వేణు పేర్కొన్నారు.తనకు పాప, బాబు ఉన్నారని పాప 12వ తరగతి బాబు 10వ తరగతి చదువుతున్నారని వేణు చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతారా అనే ప్రశ్నకు నో క్లూ అని ఆయన సమాధానం ఇచ్చారు.ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయనే ప్రశ్నకు వేణు స్పందిస్తూ నేను బావిలో కప్పలాంటోడినని నాకు బయటి ప్రపంచం అసలు తెలియదని వేణు అన్నారు.

ప్రపోజల్స్ గురించి తెలియదు కానీ నేను ఎక్కడికి వెళ్లినా వయస్సులో పెద్ద అయిన ఆడవాళ్లు బాబు నీకు పెళ్లైందా అని అడుగుతారని వేణు తెలిపారు.

Telugu Venu, Rama Rao Duty-Movie

అలా ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలను కాంప్లిమెంట్ గా తీసుకుంటానని వేణు చెప్పుకొచ్చారు.మంచి మూవీ ఆఫర్లు వస్తే చేస్తానని వేణు కామెంట్లు చేశారు.ప్రస్తుతానికి మంచి ఆర్టిస్ట్ గా ఉండాలని నేను అనుకుంటున్నానని వేణు చెప్పుకొచ్చారు.

జీవితం ఏది ఇస్తే అది తీసుకో.ఏముంటే దానిని ఎంజాయ్ చెయ్ అని వేణు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube