గత ఐదేళ్ల నుండి చూస్తే మన టాలీవుడ్ సినీ పరిశ్రమ అంచలంచలుగా ఎదుగుతూ వస్తుంది.సౌత్ పరిశ్రమలో గతంలో కోలీవుడ్ అగ్ర స్థానంలో ఉండేది.
కానీ ఇప్పుడు అలా కాదు.బాహుబలి సిరీస్ తర్వాత అంతా మారిపోయింది.
జక్కన్న వేసిన రాజబాటలో మన మేకర్స్, హీరోలు నడుస్తున్నారు.ఇప్పుడు సౌత్ లో అత్యధిక బడ్జెట్ సినిమాలు మన తెలుగు పరిశ్రమ నుండే వస్తున్నాయి.
సౌత్ లో తెలుగు, తమిళ్ అతి పెద్ద పరిశ్రమలు కాగా.కన్నడ, మలయాళం పరిశ్రమలు చిన్న పరిశ్రమలు.భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువుగా తెలుగులో వస్తుండగా.కొన్ని సినిమాలు కోలీవుడ్ నుండి కూడా వస్తున్నాయి.
ఇంతకు ముందు టాలీవుడ్, కోలీవుడ్ ఒకే స్థాయిలో ఉండేవారు.కానీ ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి పాన్ ఇండియా విజయాల తర్వాత మన తెలుగు పరిశ్రమ ఎవ్వరి అందరి స్థాయిలో దూసుకు పోతుంది.
అలాగే మిగతా ఇండస్ట్రీల నటులు కూడా మన తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు.ఇది వరకు మన సినిమాలను చిన్న చూపు చేసే బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు సైతం మన తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.
అలాగే పరాయి బాషా నటులు తమ సినిమాలను ఇంతకు ముందు డబ్బింగ్ చేసి వదిలేసే వారు కానీ ఇప్పుడు టాప్ స్టార్స్ సైతం హైదరాబాద్ కదిలి వచ్చి ప్రొమోషన్స్ చేస్తూ ఇక్కడ మార్కెట్ సంపాదించడం కోసం ఆరాట పడుతున్నారు.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇటు హైదరాబాద్ తో పాటు అటు వైజాగ్ లో కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.అలాగే మిగతా బాషల షూటింగులు కూడా మన హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి.మినిమమ్ ఒక్క షెడ్యూల్ అయినా ఇక్కడ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీలో అన్ని బాషల షూటింగులు జరుగుతున్నాయి.ఇలా మన టాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం అత్యాధునిక పరిజ్ఞానంతో స్టూడియోలను నిర్మిస్తుండడం కూడా సంతోషించాల్సిన సమయం.
మరి కొన్ని సంవత్సరాలు పోతే మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి పెద్ద వ్యత్యాసం ఉండదు.