తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.
మరి ఎక్కువగా పవన్ కళ్యాణ్ విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.కాగా బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో మరింత అడ్వాన్స్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్లు, చేసే వ్యాఖ్యలు ప్రతీవి కూడా వైరల్ అవుతూ కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి.కాగా ఈ మధ్యకాలంలో బండ్లన్న తీరు చర్చనీయాంశంగా మారింది.
కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఒక వైపు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న బండ్ల గణేష్ రాజకీయాలలో కూడా అంతే యాక్టివ్ గా వ్యవహరిస్తున్నాడు.
అదేవిధంగా బిజినెస్ మాన్ గా కూడా తన సత్తాను నిరూపించుకున్నారు.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేసిన వారిపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఘాటుగా సమాధానం చెబుతూ ఉంటాడు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు బండ్ల గణేష్ పెట్టే ట్వీట్స్ అన్నీ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి దుమారం రేపుతోంది.
బానిసత్వానికి ఒక హద్దు ఉంటుంది.మనిషితో అయినా జంతువుతో అయినా? అంటూ ఓ ఫోటో, వీడియో పోస్ట్ చేశారు బండ్ల గణేష్.

ఇక అందులో ఒక గాడిద కనిపిస్తోంది.దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.అయితే బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ తో తెరపైకి పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది.అయితే బండ గణేష్ చేసే ట్వీట్స్ కీ కామెంట్ల మోత మోగడం కామనే అయినప్పటికీ, ఇటీవల కాలంలో చేస్తున్న ట్వీట్స్ పలు అనుమానాలకు తెర లేపుతున్నాయి.
అయితే ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ఏమన్నా కామెంట్స్ చేస్తున్నారా? అనే డౌట్స్ కొందరిలో వస్తున్నాయి.ఇందుకు కారణం రీసెంట్‌గా ఆయన హాలులో ఉన్న పవన్ ఫోటో తీసేయడమే.
ఈ క్రమంలోనే తాజాగా వదిలిన గాడిద ఫోటో చూసి ఈ ఇష్యూపై ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచన చేస్తున్నారు.







