రవితేజ హీరోగా రూపొందిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను విడుదల చేయబోతున్నారు.మరి కొన్ని గంటల్లో సినిమా ను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి అయ్యాయి.సినిమా యొక్క సెన్సార్ కూడా పూర్తి అయ్యింది.
కనుక సినిమా యొక్క అంచనాలు భారీగా పెరిగాయి.అయితే ఈ సినిమా కు గత రవితేజ సినిమా ఖిలాడీ ప్రభావం బాగా పడింది.అందుకే ఈ సినిమా పాతిక కొట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాల్సింది కేవలం 17.35 కోట్ల రూపాయలు మాత్రమే బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా హిట్ అయితేనే రవితేజ తదుపరి సినిమాలు అయిన ధమాకా.టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు సినిమా లకు మంచి బిజినెస్ అయ్యాను.
తాజాగా చిరంజీవి సినిమా లో కూడా రవితేజ నటిస్తున్నాడు.చిరంజీవి సినిమాకు కూడా రామా రావ్ ఆన్ డ్యూటీ సినిమా ఆధారంగా జనాలు అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి.
అందుకే రామా రావు ఆన్ డ్యూటీ సినిమా యొక్క ఫలితం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఒక్క సినిమా ఫలితం పై అన్ని సినిమా ల భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది.
రామా రావు ఆన్ డ్యూటీ సినిమా కనుక నిరాశ పర్చితే ఖచ్చితంగా అన్ని సినిమా లకు కూడా కనీసం 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కడం గొప్ప విషయం అంటున్నారు.అన్ని సినిమా ల్లోకి టైగర్ నాగేశ్వరరావు అంచనాలు భారీగా ఉన్నాయి.
అంతే కాకుండా త్వరలో రాబోతున్న ధమాకా సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.మరి రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ఏం చేస్తుందో చడాలి.
కొత్త దర్శకుడు అయిన శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.