తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం బుల్లితెర కమెడియన్ లు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం బుల్లితెరపై ఇప్పటికి ఎన్నో రకాల కామెడీ షోలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే జాతి రత్నాలు స్టాండరప్ కామెడీ కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇది ఈ మధ్యకాలంలో మొదలైన ఈ షో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.
కాగా ఈ షో కి యాంకర్ శ్రీముఖి పోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో కొందరు జబర్దస్త్ కమెడియన్స్ ఉన్నారు.
ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే లేటెస్ట్ ఎపిసోడ్ కూడా ఫుల్ జోష్ గా సాగింది.తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా అందులో శ్రీముఖి ఆడియన్స్ కి ఒక టాపిక్ ఇస్తుంది.
ప్రాసలు – పొగడ్తలు, ప్రాస పదాలతో పొగడ్తలు చెప్పాలని ఒక టాస్క్ ని ఇస్తుంది.ఇంతలోనే ఒక కుర్రాడు.నేను మాట్లాడే భాష తెలుగు.నువ్వు ఉన్నచోట ఉంటుంది వెలుగు అంటూ శ్రీముఖిని పొగడ్తలతో ముంచేత్తుతాడు.
ఆ తర్వాత ఒక అమ్మాయి లేచి నిలబడి ఇమ్ము ఇది నీకోసం అని చెప్పి.ఎక్కువగా తింటే వస్తుంది గ్యాస్.
మనిద్దరం కలిసి చేద్దాం రొమాన్స్.అని అనగా ఆ మాటలకు ఇమ్మానుయేల్ సిగ్గుపడుతూ ఉంటాడు.
వెంటనే శ్రీముఖి ఇది చూసి ఇంటికి వెళ్ళాక మీ డాడీ చేస్తాడు నీతో డాన్స్ అని కౌంటర్ వేస్తుంది.అప్పుడు పంచ్ ప్రసాద్.
ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ ఏ స్కూల్ అని అడగగా నూకరాజు హై స్కూల్ అని చెబుతాడు.

అప్పుడు ఏ క్లాస్ అని ప్రసాద్ మళ్లీ అడగగా ఆన్లైన్ క్లాస్ అంటూ ఆన్సర్ ఇచ్చి ఫన్ క్రియేట్ చేస్తారు నూకరాజు శ్రీముఖి.అప్పుడు శ్రీముఖి ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తానని అడిగింది కదా నీ అభిప్రాయం ఏంటి అని అడగగా.నాకు ఇష్టమే అని అంటాడు.
అప్పుడు నూకరాజు ఏమీ తెలియనట్టుగా రొమాన్స్ అంటే ఏమిటి అని అడగగా.ఇంతలోనే ఒక కుర్రాడు లేచి శ్రీముఖి ఇది నీకోసం అని అనగా వెంటనే శ్రీముఖి నీ ప్రాస పొగడ్త నాకు నచ్చితే నీతో కలిసి డాన్స్ చేస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇస్తుంది.
అప్పుడు ఆ కుర్రాడు ఆకాశంలో ఎగురుతుంది గద్ద.నేను రోజు నీకు కలిపి తినిపిస్తా అన్నం ముద్ద అంటూ పొగుడుతాడు.
ఇంతలోనే మరొక అమ్మాయి లేచి గుండ్రంగా తిరుగుతుంది బొంగరం.నీ వేలుకు నేను తొడిగేస్తా ఉంగరం అనడంతో ఇమ్ము సిగ్గుపడుతూ ఉంటాడు.
ఇమాన్యుల్ కి ఆ డైలాగ్ నచ్చడంతో ఆ అమ్మాయిని స్టేజి మీదకు తీసుకొని వచ్చి ఒక పాటకు డాన్స్ వేయడంతో అప్పుడు శ్రీముఖి పెళ్లి మంత్రాలు చదువుతూ ఉండగా ఇమ్మానుయేల్ కి, నూకరాజుకి రింగ్ పెట్టేస్తుంది మోనిక.ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ మొత్తం ప్రాస పొగడ్తలతో ఫుల్ ఎంటర్టైన్ గా సాగింది.







