ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జంటల విడాకుల కేసులు అభిమానులను కలవర పెడుతున్నాయి.కాగా గత ఏడాదది,ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలావరకు సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని విడిపోయారు.కాగా ఇటీవలే మలైకా అరోరా, తన భర్త అర్బాజ్ కానుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మలైకా అరోరా బాటలో తన స్నేహితురాలు కూడా పయనిస్తోంది.
గాల్స్ గ్యాంగ్ సభ్యురాలు అయిన షమితా శెట్టి తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
షమితా శెట్టి, శిల్పా శెట్టి సోదరి అన్న విషయం తెలిసిందే.ఈమె రాకేష్ బాపట్ తో పరిచయం పెంచుకోగా పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇటీవలే భర్త రాకేష్ బాపట్ షమితా శెట్టి విడిపోయినట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.అయితే అదే విషయాన్ని షమితా అధికారికంగా ధృవీకరించింది.తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఆమె తన భర్త ఇకపై కలిసి ఉండము అని తేల్చి చెప్పేసింది.వీరిద్దరూ గత ఏడాది బిగ్ బాస్ లో కలుసుకున్న విషయం తెలిసిందే.
వీరిద్దరి రిలేషన్షిప్ బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభమయింది.అయితే ఏడాదిలోపే మళ్ళీ విడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇది ఇలా ఉంటే వీరిద్దరు విడిపోతున్నప్పటికీ వీరిద్దరూ కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించనున్నారు.అదే విషయం గురించి చెబుతూ వారి రిలేషన్ గురించి కూడా ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది షమితా శెట్టి.
బ్రేకప్ ని స్పష్టం చేయడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను.రాకేష్, నేను ఇప్పుడు కలిసి లేము.గత కొంతకాలంగా మేము దూరంగానే ఉంటున్నాం.కానీ ఈ మ్యూజిక్ వీడియో మాకు చాలా మద్దతునిచ్చిన అభిమానులందరికీ కోసం అని అంటూ ఆమె రాసుకొచ్చింది.
అలాగే మీ ప్రేమను మాకు అందించడం కొనసాగించండి.ఇక్కడే సానుకూలత కొత్త అంశాలు ఉన్నాయి.
మీ అందరికీ ప్రేమ కృతజ్ఞతలు అని ఆమె రాసుకొచ్చింది.