గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప హీరోలు ఉన్నారు.ఈ హీరోలు తమ నటనతో ఇతర రాష్ట్రాల, విదేశీ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు.
అయితే తాజాగా 68వ నేషనల్ అవార్డ్స్ ను ప్రకటించగా ఇన్ని సంవత్సరాలలో ఒక్క టాలీవుడ్ హీరోకు కూడా నేషనల్ అవార్డ్ రాలేదు.
తెలుగు హీరోలకు యాక్టింగ్ రాదా? ఎందుకు అవార్డుల విషయంలో టాలీవుడ్ హీరోలపై వివక్ష చూపుతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ హీరోలు ఎన్నో ప్రయోగాలు చేశారని ఆ ప్రయోగాత్మక సినిమాలు విజయం సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.తెలుగు హీరోలు కావడం వల్లే చాలామంది టాలెంటెడ్ హీరోలకు అవార్డులు దక్కడం లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
రొటీన్ సినిమాలకు అవార్డులు ఇవ్వాలని కోరుకోవడం లేదని ప్రయోగాత్మక సినిమాలు, జానపద సినిమాలు, అద్భుతమైన కథలతో అవార్డులు సాధించిన సినిమాలకు అయినా అవార్డులు ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.చిరంజీవి నటించిన రుద్రవీణ, బాలయ్య నటించిన ఆదిత్య 369, భైరవద్వీపం, వెంకటేష్ చంటి, నాగార్జున గీతాంజలి లాంటి సినిమాలకు సైతం హీరోలకు నేషనల్ అవార్డులు రాలేదు.

పొలిటికల్ ఎజెండాల వల్లే టాలీవుడ్ హీరోలకు నేషనల్ అవార్డులు రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తమిళ, హిందీ హీరోలకు నేషనల్ అవార్డులు వస్తుంటే టాలీవుడ్ హీరోలకు మాత్రం అన్యాయం జరుగుతోంది.టాలీవుడ్ హీరోలకు నేషనల్ అవార్డ్ రాకపోవడంపై హీరోలు, దర్శకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.టాలీవుడ్ హీరోలకు అన్యాయం జరగడం వాస్తవమే అని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







