రేణు దేశాయ్. ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి.
అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాల్లో నటించిన రేణూ దేశాయ్ చివరికి ఆ హీరోతోనే ప్రేమలో పడిపోయింది.ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు ఇద్దరు.
అయితే ఇక పెళ్లికి ముందే పదేళ్లు సహజీవనం కూడా చేశారు.ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే అకీరా నందన్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ జన్మనిచ్చారు.
పెళ్లి తర్వాత మరో కూతురు పుట్టింది.ఆ తర్వాత కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చివరికి విడాకులు తీసుకొని వేరు పడ్డారు.
దీంతో ఎన్నో ఏళ్ల నుంచి రేణు దేశాయ్ ప్రస్తుతం పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్కు దూరంగానే ఉంటుంది.పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ఒక పేరు ను తొలగించుకోవడానికి ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే వీరిద్దరూ విడిపోయిన పిల్లల కోసం అప్పుడప్పుడు మాత్రం కలుస్తుంటారు.ఇకపోతే ఇటీవల రేణు దేశాయ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన సమయంలో రేణుదేశాయ్ కి భారీ మొత్తంలో భరణం పొందింది అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పవన్ కళ్యాణ్ తనకు ఒక్క రూపాయి కూడా భరణం చెల్లించలేదని.తాను కూడా అడగలేదు అంటూ చెప్పుకొచ్చింది.అయితే పిల్లలకు ఒక తండ్రిగా చేయాల్సిందంతా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో మరోవైపు ఇతర కార్యక్రమాలలో జడ్జి గా అవతారమెత్తి బాగానే సంపాదిస్తుంది రేణుదేశాయ్.ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్లో ఈమెకు ఒక ఖరీదైన ఇల్లు ఉందట అంతే కాకుండా మూడు కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పూణేలో కూడా ఎన్నో స్థిరాస్తులను కలిగి ఉందట రేణుదేశాయ్.ఇక ఇవన్నీ కలిపితే రేణు దేశాయ్ ఆస్తుల విలువ 40 కోట్ల వరకు ఉంటుందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఇది ఎంతవరకు నిజం ఉన్నది మాత్రం తెలియదు.







