తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే సర్వేల ప్రభావం ఎంతగా ఉందో తెలిసిపోతుంది.గులాబీ బాస్ పీకే సర్వేల ఆధారంగా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
అలాగే సొంతంగా కూడా సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుంటున్నారు.అయితే పీకే సర్వేల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని నివేదికలు ఇవ్వడంతో కేసీఆర్ కొంత ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ కంటే కేటీఆర్ కే ప్రజాధరణ ఉందట.
కేటీఆర్ ను కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎవరూ పట్టించుకోవడం లేదట.ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 70 నుంచి 80 శాతం వరకు యాంటి కేసీఆర్ అనే సెంటిమెంట్ తో ఓట్లు పడుతాయని ఓ టీవి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అన్ని సర్వేల్లో కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయని.ఇందులో కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలినట్లు కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని.దీంతో ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అనవసరంగా పెట్టుకుంటన్నాడన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు.
తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఇప్పుడు అదే సెంటిమెంట్ వ్యతిరేకిస్తోందిని అన్నారు.

గత కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేసినా అదీ ముందుకు సాగలేదు.పైగా కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులపై శ్రద్థ పెట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అలాగే మురిపించిన 57 ఏళ్ల పింఛన్ ముందుకు సాగలే. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెప్పినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పూర్తి చేయడం.
రైతులనూ అయోమయానికి గురి చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం.ఇటు పీకే నివేదికలో కూడా ఇవే అంశాలు తేలడంతో కేసీఆర్ ఒత్తిడి ఫీల్ అవుతున్నట్లు సమాచారం.
అయితే కేసీఆర్ సొంతంగా సర్వే చేయించినా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తి మరో సారి బయటపడింది.

గ్రామీణ ప్రాంతాల్లో కేటీఆర్ ఊసే లేదు.ఈ క్రమంలోనే కేసీఆర్ కంటే కేటీఆర్ పై ఆదరణ పెరుగుతోందని అంటున్నారు.దీంతో ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అవడం ఖాయమేనా.? అన్న చర్చ సాగుతోంది.అయితే కేటీఆర్ పై కూడా పట్టణ నగర ప్రాంతాల్లోనే ఆధరణ ఉందని గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఊసెత్తడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనడం అనుమానాలకు తావిస్తోంది.
అన్ని చికాకులతో ప్రస్తుతం కేసీఆర్ ఒత్తిడిలో ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం.ఇక తాజాగా వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లు రావడంతో బాహుబలి మోటార్లు మునిగి చెడిపోయాయి.
మరోవైపు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది కష్టమేనని లోక్ సభలో ఓ మంత్రి కూడా చెప్పడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందేమోనని అంటున్నారు.







