టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ట్రైలర్ లో రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ సినిమా పై అంచనాలు పెంచాయి.దీంతో ఈ సినిమా పక్క హిట్ అవుతుందని భావిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా అనన్య పాండే నటించినది.ఈ సినిమాకి ఈ అమ్మడి అందాలు ప్లస్ పాయింట్ అయినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా మొదట అనన్య పాండేని కాకుండా మరొక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని సంప్రదించారు.
ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఆలియా భట్.ఈ సినిమా స్టోరీ మొత్తం విన్న అలియా భట్ కథలో తనకు వాల్యూ లేదనే ఒక కారణంతో ఈ సినిమాకు నో చెప్పిందని సమాచారం.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అటు బాలీవుడ్, టాలీవుడ్ కోలీవుడ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఆలియా భట్ ఈ పాన్ ఇండియా సినిమాని మాత్రం రిజెక్ట్ చేసింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని ఆలియా భట్ నో చెప్పటంతో ఆ స్థానంలో అనన్య పాండే అవకాశం దక్కించుకుంది.అయితే ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ట్రైలర్ చూసిన ఆలియా ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అనవసరంగా వదులుకున్నాననే అని ఫీల్ అయినట్టు తెలుస్తోంది.ఈ సినిమా హిట్ అయితే టాలివుడ్ లో అనన్య పాండే కి వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.