నన్ను గోపీచంద్ మోసం చేశాడు.. అప్పుడే నా కెరీర్ డౌన్ అయ్యింది.. అమ్మ రాజశేఖర్!

తెలుగు ప్రేక్షకులకు డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు వరకు అమ్మ రాజశేఖర్ ఎవరు అన్నది చాలామందికి తెలియదు.

 Amma Rajasekhar Shocking Comments On Mass Hero Gopichand Story Copy Issue , Nit-TeluguStop.com

కానీ బిగ్ బాస్ హౌస్ కి ఆ తర్వాత ఇస్మార్ట్ జోడి షో ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఒకప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ కూడా డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఆ తర్వాత డాన్స్ మాస్టర్ నుండి దర్శకుడిగా మారారు.అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత అమ్మ రాజశేఖర్ మాస్టర్ పాపులారిటీ మరింత పెరగడంతో ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మ రాజశేఖర్ మాస్టర్, టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.కాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ తన జీవితంలో జరిగిన మోసాల గురించి చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.

ఒకానొక సమయంలో హీరో గోపీచంద్ ద్వారా కూడా మోసం జరిగింది అని అమ్మ రాజశేఖర్ ద్వారా కూడా తనకు మోసం జరిగింది అని ఇంటర్వ్యూలో చెప్పడం.ఆశ్చర్యం కలిగించే విషయం.

ఎందుకంటే గోపీచంద్ వివాదాలకు దూరంగా ఉంటాడు.అంతేకాకుండా గోపీచంద్ కెరీర్ లో చూసుకుంటే ఎవరితోనూ కూడా పెద్దగా మాట్లాడింది లేదు.

Telugu Amma Rajasekhar, Bigg Boss, Gopichand, Gopichandstory, Nitin, Tollywood-M

అలాగే ఏ విషయంలో కూడా సోషల్ మీడియాలో నిలిచింది లేదు.అటువంటిది తన గోపీచంద్ పై అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఈ విధంగా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.మొన్నటికి మొన్న తన సినిమా రిలీజ్ ఈవెంట్ కు పిలిచినా హీరో నితిన్ రాలేదని చెబుతూ అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో నితిన్ పై నెగిటివ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.ఒకప్పుడు డాన్స్ నేర్పిన గురువుకే మాట తప్పి మోసం చేయడం ఎంతవరకు న్యాయమని అమ్మ రాజశేఖర్ స్టేజ్ పైన చాలా ఎమోషనల్ అయిపోయాడు.

హీరో నితిన్ విషయంలో మండిపడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలిచిన రాజశేఖర్ తాజాగా మరొకసారి గోపీచంద్ విషయంలో కూడా ఇలా షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

Telugu Amma Rajasekhar, Bigg Boss, Gopichand, Gopichandstory, Nitin, Tollywood-M

గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమా చేసిన తర్వాత మరొక సినిమా కూడా చేద్దామని హీరో గోపీచంద్ అమ్మా రాజశేఖర్ తో అన్నాడట.అందులో ఒక లైను గురించి వివరించగా గోపీచంద్ చేద్దామని చెప్పాడట.అయితే ఆ క్రమంలోనే ఒక లైన్ చెప్పగా తప్పకుండా చేద్దామని అన్నాడట.

ఇక అప్పుడు రాజశేఖర్ కు సురేష్ బాబు ప్రొడక్షన్ నుంచి సినిమా చేసే అవకాశం వచ్చిందట.హీరో వెంకటేష్ గారు సురేష్ బాబు ఒప్పుకోవడంతో స్పెషల్ సెట్ కూడా వేయడం జరిగింది.

అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అని తెలిపాడు అమ్మ రాజశేఖర్.అయితే వెంకటేష్ తో సినిమా మొదలు పెట్టాలి అనుకుంటున్నా సమయంలో గోపీచంద్ సత్యరాజ్ కాంబినేషన్ లో శంఖం సినిమా వచ్చిందట.

ఆ సినిమా చూసినప్పుడు తనకు గతంలో గోపీచంద్ కు చెప్పిన కథలా అనిపించిందట.అప్పుడు నిర్మాత సురేష్ బాబు కూడా ఆ కథ వద్దని మరొక సినిమా చేద్దామని అన్నాడట.

ఆ తర్వాత మళ్లీ ప్రాజెక్టు సెట్ కాకపోవడంతో అప్పుడు చాలా బాధపడి ఏడ్చేసాను అని చెప్పుకొచ్చారు అమ్మ రాజశేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube