ఆమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చడ్డా.ఈ సినిమాలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.
ఈ సినిమా తెలుగు వర్షన్ లో కూడా రిలీజ్ అవుతుంది.తెలుగు వర్షన్ ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.
ఈమధ్యనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిరు సందడి చేశారు.ఆమీర్ ఖాన్, నాగ చైతన్యలతో చిరు కూడా ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న లాల్ సింగ్ చడ్డా సినిమా తెలుగులో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.అందుకు మెగాస్టార్ మెగా ఐడియా వేశారని తెలుస్తుంది.
చిరు, ఆమీర్ ఖాన్, నాగ చైతన్యతో బిగ్ బాస్ సూపర్ హోస్ట్ కింగ్ నాగార్జునతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట.స్వయంగా నాగ్ ఈ ఇంటర్వ్యూని హోస్ట్ చేస్తారని తెలుస్తుంది.
లాల్ సింగ్ చడ్డా వెనక ఉన్న విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తారట.
లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో చిరు తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
అంతేకాదు ఆమీర్ ఖాన్ కూడా మ్యాగ్జిమం తెలుగు మీడియా మొత్తం కవర్ చేసే ప్లాన్ లో ఉన్నారట.అయితే నాగ్ తో చేసే ఇంటర్వ్యూ మాత్రం చాలా స్పెషల్ గా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఆమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా చిరు కోసం స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేయగా సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి సినిమా పై ప్రశంసలు కురిపించారని తెలుస్తుంది.
ఆమీర్ ఖాన్ ఈ సినిమాతో తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు.ఈ సినిమా హిట్టైతే మాత్రం ఆమీర్ ఖాన్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.







