జీడి జెర్రీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది లెజెండ్’.ఇక ఈ సినిమాకు హీరోగా అవతారం ఎత్తాడు ప్రముఖ వ్యాపారవేత శరవణన్.
ఇక ఎటువంటి టాలెంట్ లేకున్నా కూడా హీరోగా అడుగుపెట్టాడు శరవణన్.ఈయన చూడటానికి చాలా పెద్ద వయసు వ్యక్తిలా ఉంటాడు.
ఇక ఈయన తమిళనాడు కేంద్రంగా ప్రముఖ వస్త్ర దుకాణాల చేయిన్ నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా బంగారు ఆభరణాల విక్రేత.
వస్త్ర దుకాణాల చేయిన్ కు అధినేతనే కాకుండా ఇంకా ఈయన చేపడుతున్న బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు.ఇక ఈయన ఈ సినిమాలో హీరోగా నటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
నిజానికి నటనకు వయసు అడ్డం కాదు అన్నట్లుగా.లేటు వయసులో కూడా హీరో అయ్యాడు ఈ లెజెండ్ శరవణన్.
ది లెజెండ్ అనే పేరుతో న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో సొంత నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించాడు శరవణన్.ఇందులో ఊర్వశి రౌతెలా కీలక పాత్రలో నటించింది.
గతంలో ఈ లెజెండ్ తన సినిమా ప్రమోషన్స్ కోసం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్లను గెస్ట్ లుగా ఆహ్వానించుకున్నాడు.

నిజానికి ఈయన తన స్టోర్స్ కు స్టార్ లను బ్రాండ్ కు ప్రచారకర్తగా చేస్తుంటాడు.అలా హీరోయిన్లతో బ్రాండ్ ప్రమోషన్ చేసిన శరవణన్ ఇప్పుడు అదే హీరోయిన్ల పక్కన హీరోగా ఎదిగాడు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కూడా ఇటీవల చెన్నైలో నిర్వహించారు.
ఈ సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా విడుదల కానుందని తెలుస్తుంది.
ఇక డాన్స్ ల పరంగా, నటనపరంగా ఆయన నుంచి అంతగా ఆశపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయనలో అటువంటి టాలెంట్ లేదు.కానీ ఆయన సినిమా విషయంలో కష్టపడిన తీరును ప్రశంసించవచ్చు అని తెలుస్తుంది.
ముఖ్యంగా ఆయన తన సినిమాపై ఖర్చు పెట్టిన తీరు చూస్తే మాత్రం పెద్ద స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోక తప్పదు.అలాంటిది అంత ఖర్చు పెట్టి సినిమా చేశారు ఆయన.

ఇక ఈ సినిమా కోసం పాపులర్ స్టార్స్ తో పాటు టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు.ఇక ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించగా అందులో లెజెండ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఏకంగా ఆయన పాన్ ఇండియా భాషలలో ఒకేసారి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.
దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం గోల రా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
మరి ఈ సినిమా ఈ లెజెండ్ కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో.అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో సినిమా విడుదల రోజు చూడాల్సిందే.







