తక్కువ సమయంలోనే దర్శకునిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న డైరెక్టర్లలో బాబీ ఒకరని చెప్పవచ్చు.వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న బాబీ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కు బాబీ గెస్ట్ గా హాజరయ్యారు.బాబీ ఈ ఈవెంట్ లో మాట్లాడూతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాబీ మాట్లాడుతూ రవితేజను పట్టుకుంటే లైఫ్ సెటిలైపోతుందని మాలాంటి వాళ్ల రేంజ్ రేంజ్ రోవర్ స్థాయిలో సెట్ అయిపోతుందని బాబీ చెప్పుకొచ్చారు.రవితేజతో సినిమాలు చేసిన వాళ్లలో నేను ఒకడినని బాబీ కామెంట్లు చేశారు.
రవితేజ పవర్ సినిమాకు దర్శకునిగా పని చేసే ఛాన్స్ ఇవ్వడంతో నా లైఫ్ మారిపోయిందని బాబీ చెప్పుకొచ్చారు.పవర్ సినిమా వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ కు పని చేసే ఛాన్స్ దక్కిందని బాబీ అన్నారు.
పవన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కగా ఆ విషయాన్ని మొదట నా ఫ్యామిలీకి చెప్పానని బాబీ తెలిపారు.

ఆ సమయంలో రవితేజ నా భుజం తట్టారని అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని బాబీ చెప్పుకొచ్చారు.సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ నాతో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని బాబీ కామెంట్లు చేశారు.

రవితేజతో మరో సినిమా చేయాలని అనుకున్న సమయంలో జై లవకుశ మూవీకి పని చేసే ఛాన్స్ దక్కిందని నేను ఇబ్బంది పడుతూనే ఆ విషయం చెప్పగా రవితేజ నన్ను ఎంతగానో ప్రోత్సహించారని బాబీ చెప్పుకొచ్చారు.వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కూడా నటిస్తున్నారని నేను కథ చెప్పిన వెంటనే రవితేజ ఒప్పుకోవడంతో సంతోషం కలిగిందని బాబీ కామెంట్లు చేశారు.ఒక విధంగా రవితేజ వల్లే జై లవకుశ మూవీకి పని చేసి బాబీ దర్శకునిగా తన ఇమేజ్ ను పెంచుకున్నారు.







