పదవులు మనిషికి అలంకారం కాదు.పదవి అంటే బాధ్యత, ఒక బాధ్యత మీద రెండు నుంచి కొన్ని వేలు దాటి, లక్షలు దాటి కొట్ల మంది ఆశల సౌధమే పదవి అంటే.
అవి పొందుకున్నవారి అర్హత కు, మొదటి కారణం చిత్తశుద్ధి.తనది, మనది అనే స్వార్ధ చింతన వదిలిపెట్టాలి.
సర్వమానవ సౌబ్రాతృత్వమే పదవి అంటే అనే నగ్నసత్యాన్ని తెలుసుకుని ఈనాడు అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయపరంగాను అధికారంలో కొనసాగుతున్న వారు అనేకం.వారిలో కనిపించేది భందు ప్రీతికాదు, దేశ భక్తి.
అలాంటి దేశభకిని కపరచిన మహా నేతలకు శిరసు వంచి నమస్కరిస్తున్నారు భారతీయులు.దేశ మంటే మట్టికాదని నమ్మిన మహోన్నత వ్యక్తిత్వాలున్న వ్యక్తుల్లో రామ్ నాథ్ కోవింద్ ఒకరు.
రాజకీయాల్లో అనేక పదవులును వరించినా, తానెన్నడూ గర్వించని రామ్ నాద్, పదవులకే వన్నెతెచ్చిన వైనం, ఆయన ఆశించకుండానే రాష్ట్రపతి పదవి ఆయను వరించిందని ఆయన సన్నిహితులు చెబుతారు.దేశం యావత్తూ గర్వించేలా, ప్రపంచ దేశాలకు తనవంతు గా మంచి సందేశాన్నిచ్చిన ఆయన పాలన నిజంగానే హర్షనీయం.
రామ్‌నాథ్ కోవింద్ 1945, అక్టోబరు 1న పుట్టిన ఆయన 1991లో బీజేపీలో రాజకీ జీవితాన్ని ప్రారంభించారు.కామర్స్ లో పట్టబద్రుడైన కోవింది ఆ తర్వాత లా పూర్తి చేసి న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు.
ఆతర్వాత ఆయన సివిల్ సర్వీస్ లోనూ ఉత్తీర్ణుడయినా,.ఆ సూపర్ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు., దానికి బదులుగా ఐఏఎస్ కు అనుబంధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సన్నిహితులు చెబుతారు .1971 నుంచి 79 వరకూ డిల్లీ బార్ కౌన్సిల్ లో న్యావాదిగా చేరారు.1977-78 లొ అప్పటి భారత ప్రధాని మురార్జీ దేశాయ్ కు వ్యక్తిగత సహాయకునిగా ఉన్నారు.అనంతరం రాజకీయాల్లో చేరిన తర్వాత 1993 వరకూ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా కొనసాగిన రామ్ నాథ్, 1998 నుంచి 2002 వరకూ బీజేపీ దళిత మోర్చాకు అధ్యక్షునిగా ఉన్నారు.
గ్రాతం పూర్ శాసన సభ నియోజకవర్గం నుంచి ఒకసారి, భోగ్నిపూర్ శాసన సభ నుంచి ఒకసారి బీజేపీ పార్టీఅభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.ఆతర్వాత 1994 లో పార్లమెంట్ సభ్యునిగా యూ.పీ నుంచి ఎన్నికయ్యారు.మొత్తం రెండు సార్లు.
, అంటే 10 సంవత్సరాలపాటు పార్లమెంట్ సభ్యునిగా ఆయన సేవలందించారు.పార్లమెంట్ మెంబర్ గా ఆయన ధాయ్‌లాండ్, నేపాల్, పాకిస్థాన్, సింగపూర్, జర్మనీ, స్వ్జర్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యయనం కోసం పర్యటనలు చేసారు.

రాజకీయాల్లో ఆటూ పోటులు సహజం., అలాగే గెలుపు ఓటములు అంతకంటే సహజం.రామ్ నాథ్ కోవింద్ మాత్రం అందుకు అతీతమేదీ కాదు.ఆయన రాజకీయ చరిత్రలో ఆటుపోటులను, గెలుపు ఓటములను ఒకటిగానే చూసారు, గెలిచినపుడు పొంగిపోనూ లేదు.2015 లో రామ్ నాథ్ కోవింద్ బీహార్ కు గవర్నర్ గా నియమించ బడ్డారు.బీహార్ గవర్నర్ గా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలకలేదు.
అప్పటి సీఎం నితీష్ కుమార్ , రామ్ నద్ ను గవర్నర్ గా నియమించడాన్ని వ్యతిరేకిండంతో, ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి.బీహార్ గవర్నర్ గిరిని రామ్ నాథ్ ఓ సవాల్ గా తీసుకున్నార.
నితీష్ కుమార్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టారు.ముఖ్యంగా అర్హత లేని ఉపాధ్యాయుల నియామకాల పదొన్నతులను సీరియస్ గా అడ్డుకున్నారు.
అంతేకాదు విశ్వ విధ్యాలయాల్లో అనర్హులైన అభ్యర్థుల నియామకాలపైనా న్యాయ కమీషన్ వేసారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం గత ఏడాది 2017 జూలై 24న ముగియడంతో, కొత్త రాష్ట్రపతి కోసం బీజేపీ కూటమి దళిత నేత, బీహారు గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్.డి.ఎ.ప్రతి పాదించింది.జూన్ 2017 న కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డరు.ఇక్కడ మాత్రం సీఎం నితీష్ కుమార్ తమ మద్దతును ప్రకటించారు.2017 జూలై 20 న ఎన్నికలలో రాష్ట్రపతిగా ఎన్నికైయ్యారు.కే.ఆర్ నారాయణన్ తర్వాత రామ్ నాద్ కోవింద్ రెండో దలితన రాష్ట్రపతి.ఇపుడు , మళ్లా ద్రౌపది ముర్ము మూవడ దళిత రాష్ట్రపతిగా ఎన్నికవ్వడం తో, దేశంలో బీజీపీ పాలనపై ప్రజల్లో విశ్వాసనీయత మరింతగా పెరిగిందనే చెప్పాలి.ప్రస్తుతం రాష్ట్రపతిగా రామ్ నాద్ కోవింద్ పదవి ఈ రోజుతో ముగియనుండటంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకడానికి కేంద్ర ప్రభత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
మరోవైపు రాష్ట్రపతి గా కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం పూర్తికానున్నట్లు అధికారిక సమాచారం.







