ప్రవాస కార్మికులకు నెలవైన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది.తమ దేశ నియమ నిభంధనలు అతిక్రమించిన వారు ఎలాంటి వారైనా సరే కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ వారిపై చర్యలు చేపట్టడంలో వెనుకాడని కువైట్ తాజాగా తమ దేశ వీసా నిభంధనలను అతిక్రమించిన విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఈ ప్రభావం భారతీయ ప్రవాస కుటుంబాల పై తీవ్రమైన ప్రభావం చూపుతోందట.ఇంతకీ కువైట్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటనే వివరాలలోకి వెళ్తే.
ప్రవాస కార్మికులు అత్యధిక శాతం మంది కువైట్ లో ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.ఇలా కువైట్ వెళ్ళే వారిలో అత్యధిక శాతం మంది భారతీయులే ఉంటారు.
ఆ తరువాత స్థానంలో ఈజిప్ట్, పాకిస్తాన్, వంటి దేశాలకు చెందిన వారు ఉంటారు.అయితే వర్క్ వీసా పై కువైట్ వెళ్ళిన వారు తమ కుటుంభ సభ్యులను కువైట్ తీసుకువెళ్ళి వారితో కొంత కాలం గడిపేందుకు వీలుగా ఆ దేశం ఫ్యామిలీ విజిట్ వీసాను ఏర్పాటు చేసింది.
అయితే ఫ్యామిలీ విజిట్ వీసాపై కువైట్ వచ్చిన ప్రవాసుల కుటుంబ సభ్యులు గడువు తీరిన తరువాత కూడా కువైట్ వీసా నిభందనలకు విరుద్దంగా కువైట్ లోనే ఉండిపోవడంతో
అలంటి వారిపై చర్యలు తీసుకోవాలని భావించింది కువైట్ ప్రభుత్వం.సుమారు 20 వేల మంది ఫ్యామిలీ విజిట్ వీసాలపై వచ్చి గడువు ముగిసిన తరువాత కూడా కువైట్ లోనే ఉండిపోయారని దాంతో ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా కువైట్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ 20 వేల మందిపై చర్యలు తీసుకోనున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ చేస్తారనేది మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.కొందరు ప్రవాసులు చేసిన తప్పులకు ఎంతో మంది తమ కుటుంబ సభ్యులు ఈ విజిట్ వీసాలపై రాలేని పరిస్థితి నెలకొందని కొందరు ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







