68వ జాతీయ సినిమా అవార్డు ల్లో తెలుగు సినిమా లకు మంచి ప్రాముఖ్యత.ప్రాధాన్యత దక్కింది.
ఎప్పుడు కూడా బాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఉండే జాబితాలో ఈసారి సౌత్ సినిమా లు ఉండటం విశేషం.తెలుగు లో చిన్న సినిమా లు గా వచ్చిన సినిమా లు.భారీ సినిమాలు పెద్ద కమర్షియల్ సినిమా లు చాలా వరకు అవార్డుల ను దక్కించుకున్నాయి.తమిళం సూపర్ హిట్ మూవీ సూరారై పోట్రు కూడా అవార్డు లను దక్కించుకుంది.
ఆ సినిమాకు తెలుగు మహిళ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.తెలుగు లో ఆకాశమంతా అంటూ వచ్చిన ఆ సినిమా కు పలు జాతీయ అవార్డులు వచ్చిన నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో సుధా కొంగరతో వర్క్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కూడా స్పందించాడు.వెంకీ మామ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నాడు.

తన స్నేహితుడు సూర్య మరియు తన తో గతంలో వర్క్ చేసిన దర్శకురాలు సుధా కొంగర కోసం అన్నట్లుగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు.సూరారై పోట్రు తో పాటు తెలుగు సినిమా కలర్ ఫోటో యూనిట్ సభ్యులకు కూడా వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశాడు.కలర్ ఫోటో కు దక్కిన అవార్డు పట్ల ఆనందం గా ఉన్నట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.ఇప్పుడు వెంకటేష్ నుండి శుభాకాంక్షలు అందడంతో మరింత హ్యాపీగా ఉన్నారు.
ఇక సుధా కొంగర మరియు సూర్య లు కూడా వెంకటేష్ ట్వీట్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఒక టాలీవుడ్ హీరో ఇతర సినిమా లకు.ఇతర భాష ల టెక్నీషియన్స్ కు అవార్డు వచ్చినప్పుడు స్పందించడం అనేది నిజంగా అభినందనీయం.ఇలా కొందరు మాత్రమే ఉంటారు.
వెంకీ మామ నిజంగా మంచి మనసు ఉన్న వ్యక్తి.







