బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఈ సినిమా హిట్ తర్వాత ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
దీంతో ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ బ్రేక్ లో ఉంది.
చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు.

ఇది పక్కన పెడితే ఈ సినిమా నుండి టీజర్ త్వరలోనే రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.సలార్ టీమ్ లోని ఒకరైన ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమా టీజర్ గురించి చెప్పాడని నెట్టింట ఒక వార్త వైరల్ అయ్యింది.వచ్చే నెలలోనే స్టార్ట్ కాబోతున్న మరో షెడ్యూల్ ఆగకుండా జరగనుందని.
అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతుంది అంటూ ఈయన హింట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఈ అప్డేట్ విన్న డార్లింగ్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు.
రాధేశ్యామ్ ఇచ్చిన ప్లాప్ నుండి బయట పడాలంటే అంతకు మించిన డార్లింగ్ అప్డేట్ ఏదో ఒకటి ఉండాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండి ప్రశాంత్ నీల్ ను అప్డేట్ కోసం అడుగు తు.మరి నీల్ ఇప్పటికి వీరి మోర విన్నట్టు అనిపిస్తుంది.చూడాలి మరి టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో.








