సపోర్ట్ లేకపోతే నాగచైతన్య సినిమాలు హిట్ కావా.. అదే పెద్ద తప్పు అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య కెరీర్ తొలినాళ్ల నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ అడుగులు వేస్తున్నారు.అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకు తొలి సినిమా జోష్ తో చేదు ఫలితం ఎదురైంది.

 Nagachaitanya Career Depends On Support Details Here Nagachaitanya, Tahnkyou Mov-TeluguStop.com

దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలను అందుకోలేదు.వైఎస్సార్ మరణించిన సమయంలో విడుదల కావడం కూడా ఈ సినిమా రిజల్ట్ కు కారణమైంది.

ఆ తర్వాత 100% లవ్, ఏ మాయ చేశావె సినిమాలతో నాగచైతన్య విజయాలను సొంతం చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో నాగచైతన్య విజయాలను అందుకున్నారు.

అయితే థాంక్యూ సినిమా ఆశించిన రిజల్ట్ ను సొంతం చేసుకోకపోవడంతో సపోర్ట్ లేకపోతే నాగచైతన్య సినిమాలు ఈ మధ్య కాలంలో హిట్ కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగచైతన్య నటించిన మజిలీ సమంత వల్లే హిట్టైందని లవ్ స్టోరీ సాయిపల్లవి వల్లే హిట్టైందని బంగార్రాజు నాగ్, నాగచైతన్య నటించడం వల్లే హిట్టైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సపోర్ట్ లేకపోతే నాగచైతన్య సినిమాలు సక్సెస్ సాధించడం కష్టమని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.నాగచైతన్య సోలో హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకుని ఈ విమర్శలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Bangarraju, Majili, Nagachaitanya, Nagarjuna, Rashi Khann, Samantha, Tahn

ఫస్ట్ వీకెండ్ వరకు థాంక్యూ కలెక్షన్లకుఢోకా లేదని అయితే వీకెండ్ తర్వాత మాత్రం ఈ సినిమా పుంజుకోవడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు పరశురామ్, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ఈ సినిమాలతో చైతన్య ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు చేరతాయో లేదో చూడాల్సి ఉంది.సినిమాసినిమాకు చైతన్య రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube