ఒక మహిళ డెడ్ బాడీ ఓ ప్లాట్ లో రెండు సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది.ఎవరూ గమనించకపోవడంతో రెండు సంవత్సరాలుగా డెడ్ బాడీ అలగే ఉండటంతో కుళ్లిపోయింది.
దుర్వాసనాలతో గుర్తుపట్టలేనంతంగా డెడ బాడీ తయారు అయింది.యునైటెడ్ కింగ్ డమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఓ మౌజింగ్ అసోసియేషన్ లో 58 ఏళ్ల షిలా సెలియోన్ టెనెంట్ గా ఉంది.2019లో ఓ డాక్టర్ దగ్గరకు వెళుతుండగా ఆ మహిళ కనిపించింది.ఆ తర్వాత ఇక స్థానికులకు కనిపించలేదు.స్థానికులు కూడా ఎవరూ పట్టించుకోలేదు.ప్లాట్ లో లివింగ్ రూమ్ లో విగజీవిగా ఆమె పడిపోయింది.కుళ్లిపోయిన స్థితిలో ఎముకలు తేలి ఉంది.
పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికిరాని స్థితిలో డెడ్ బాడీ ఉంది.
అయితే రెండేళ్లుగా డెడ్ బాడీని గుర్తించనందుకు గాను హౌజింగ్ సొసైటీ క్షమాపణలు చేసింది.
ఈ రెండేళ్లకు గాను నిర్వాహకులు రెంట్ కలెక్ట్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.ఫిబ్రవరిలో పెక్ హామ్ లోని ప్లాట్ డెడ్ బాడీ బయటపడింది.
అలాగే చనిపోయిన మహిళకు వచ్చే సోషల్ బెనిఫిటస్ కూడా హౌజింగ్ సోసైటీ కలెక్ట్ చేసుకుంది.ఈ కేసును లండన్ లోని సౌత్ కరోనార్ కోర్టు విచారించింది.
ఆ మహిళ బోవెల్ ఇన్ ప్లేషన్ సమస్య ఎదుర్కొనలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు.రెండేళ్లుగా కూడా ఆమె మరణాన్ని గుర్తించకపోవడం విషాదకరమైన విషయమని కోర్టు మండిపండింది.
హౌజింగ్ సొసైటీపై దర్యాప్తు అధికారులు మండిపడ్డారు.షీలా సెలియోన్ రెంట్ కట్టకపోవడంతో ఆమె సోషల్ బెనిఫిట్స్ నుంచి రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి హౌజింగ్ సొసైటీ దరఖాస్తు పెట్టుకుంది.
ఓ తనిఖీ సందర్భంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె గ్యాస్ సప్లై కూడా కట్ చేశారు.







