ప్రతి ఒక్కరి జీవితంలోను ప్రేమ పెళ్లి అనేది ఎంతో సర్వసాధారణమైన విషయాలు అయితే కొందరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నవారు ఎంతో మంది జీవితంలో సంతోషంగా ఉన్నారు.ఇక సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన సమంత టాలీవుడ్ నటుడు నాగచైతన్యతో పీకల్లోతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఎంతో ఘనంగా వీరి వివాహం చేసుకున్నారు.అయితే నాలుగు సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఎట్టకేలకు విడిపోయారు.
ఇక వీరిద్దరూ విడిపోవడంతో వీరి విడాకులకు గల కారణం మాత్రం ఇప్పటివరకు తెలియకపోయినా తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాలవల్లే మేమిద్దరం విడిపోయామని సమంత వెల్లడించారు.
ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడం గమనార్హం.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇప్పటికే తన జీవితంలో చేసిన ఈ ప్రేమ పెళ్లి అనే తప్పును తిరిగి పునరావృతం చేయనని మరోసారి ప్రేమలో పడే ఉద్దేశం లేదని ఆ తప్పు ఇంకోసారి చేయనంటూ వెల్లడించారు.ఇలా సమంత ప్రేమ పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అదేవిధంగా ఈమె తన విడాకుల గురించి అలాగే విడాకుల సమయంలో తాను ఎలాంటి బాధలు అనుభవించాను అనే విషయం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ కార్యక్రమాల ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







